నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ వీర సింహా రెడ్డి సూపర్ సక్సెస్ కాగా మరోసారి సంక్రాంతి హీరోగా బాలయ్య తన సత్తా చాటారు. పోటీగా చిరు వాల్తేరు వీరయ్య ఉన్నా సరే దానికి పోటీ ఇచ్చి రేసులో నిలబడ్డది. ఫైనల్ గా బ్రేక్ ఈవెన్ కూడా సాధించేసింది బాలకృష్ణ సినిమా. ఇక ఎన్.బి.కె 108వ సినిమా కూడా షూటింగ్ మొదలు పెట్టాడు బాలయ్య. అనీల్ రావిపుడి డైరెక్షన్ లో ఈ సినిమా వస్తుంది. ఈ సినిమా లో హీరోయిన్ గా ఎవరు చేస్తున్నారు అన్న దాని మీద రకరకాల డిస్కషన్స్ జరిగాయి. ఫైనల్ గా బాలయ్యతో రొమాన్స్ చేసే హీరోయిన్ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.

ఇంతకీ బాలయ్య 108వ సినిమాలో హీరోయిన్ ఎవరు అంటే కాజల్ అగర్వాల్ అని అంటున్నారు. పెళ్లి తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చిన కాజల్ ఇప్పుడు మళ్లీ తిరిగి సినిమాల్లో బిజీ అవ్వాలని చూస్తుంది. ఆల్రెడీ ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్న కాజల్ బాలకృష్ణతో కూడా ఓకే చెప్పింది. కాజల్ ఈమధ్య సెలెక్టెడ్ సినిమాలు చేయాలని చూస్తుంది. పెళ్లై ఓ కొడుకు పుట్టిన తర్వాత తన లుక్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంది కాజల్.

మారిన ట్రెండ్ ప్రకారం ఈమధ్య హీరోయిన్స్ కూడా పెళ్లై పిల్లలు ఉన్నా కూడా సినిమాలకు సై అంటున్నారు. వారి దారిలోనే కాజల్ కూడా పెళ్లి తర్వాత వరుస సినిమాలు చేయాలని చూస్తుంది. బాలయ్యతో ఫస్ట్ టైం చేస్తున్న కాజల్ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ అడిగినట్టు తెలుస్తుంది. ఎంత పెళ్లైనా సరే కాజల్ కు తెలుగులో క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే బాలయ్య సరసన ఆమెని ఫిక్స్ చేశారు. ఎన్.బి.కె 108 తెలంగాణా బ్యాక్ డ్రాప్ తో అనీల్ రావిపుడి మార్క్ సినిమాగా ఉంటుందని టాక్. సినిమాలో బాలయ్య తన రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా కనిపిస్తాడని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: