రాజమౌళి దర్శకత్వంలో తెరకేక్కి  వరల్డ్ వైడ్ గా కూడా సెన్సేషన్ విజయాన్ని సాధించిన బాహుబలి సినిమా గురించి సినీ ప్రేక్షకులందరికీ కూడా కొత్తగా చెబితే అది అతిశయోక్తి అవుతుంది అని చెప్పాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో బాహుబలి సినిమాకి ఫిదా అయిపోయిన ప్రేక్షకులు ఇక ఆ సినిమాలోని ఒక్కో సీన్ చెప్పమన్నా కూడా చెప్పే లాగా ఈ సినిమా ప్రభావితం చేసింది అని చెప్పాలి. అయితే వెండితెర పైనే కాదు బుల్లితెరపై కూడా ఈ సినిమా ఎన్నోసార్లు ప్రసారమైంది. అయినప్పటికీ ఎన్నిసార్లు చూసినా ఏదో కొత్త ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది అని చెప్పాలి. అందుకే బాహుబలి సినిమా పేరు వినిపించిందంటే చాలు సినీ ప్రేక్షకులు అందరిలో కూడా ఏదో తెలియని పులకరింపు ఉంటుంది.


 ఇకపోతే ఈ సినిమా ప్రేక్షకులను ఆకర్షించడమే కాదు ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని విజయాన్ని సాధించి ఎంత బిగ్గెస్ట్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ గా... రాజమౌళిని వరల్డ్ మోస్ట్ వాంటెడ్ దర్శకుడిగా మార్చేసింది ఈ సినిమా. ఇక ఈ సినిమాలో అమరేంద్ర బాహుబలి గా నటించినా ప్రభాస్ ఎంత క్రేజ్ తెచ్చుకున్నాడో.. ఇక బల్లాల దేవుడిగా రానా కూడా అంతే పాపులారిటీ సంపాదించుకున్నాడు. అయితే వీరిద్దరి తర్వాత ఇక సినిమాలో ఆ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న పాత్ర కట్టప్ప. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే రీజన్ తోనే సెకండ్ పార్ట్ కూడా వస్తుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో కట్టప్ప పాత్రలో సత్యరాజ్  నటన చూసిన తర్వాత అతను తప్ప వేరొకరు చేసి ఉంటే ఈ పాత్ర అంతలా పండేది కాదు అని అందరు అనుకున్నారు. కానీ మాస్టర్ మైండ్ రాజమౌళి మాత్రం కట్టప్ప పాత్ర కోసం ముందుగా సత్యరాజ్  ని అనుకోలేదట. ముందుగా మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ కట్టప్ప పాత్ర చేస్తే బాగుంటుందని అనుకున్నాడట రాజమౌళి.  అయితే మోహన్లాల్ మాత్రం పాత్ర నచ్చక రిజెక్ట్ చేశాడట. ఇక ఆ తర్వాత కొంతమందిని కూడా సెలెక్ట్ చేశాడట రాజమౌళి. కానీ చివరికి రమా రాజమౌళి కల్పించుకొని సత్యరాజ్  అయితే పాత్రకు సరిపోతాడని భావించి ఇక అతన్ని సెలెక్ట్ చేశారట.

మరింత సమాచారం తెలుసుకోండి: