సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత సినీ ప్రేక్షకులకు సినీ సెలబ్రిటీలకు మధ్య ఉన్న దూరం కేవలం ఒక గీత మాత్రమే అన్నట్లుగా మారిపోయింది. ఒకప్పుడు తమ అభిమాన నటీనటులను కలవాలంటే ఎక్కడో షూటింగ్ జరుగుతున్న ప్లేస్ కి వెళ్లి ఎంతో దూరం నుంచి చూసి ఆనంద పడిపోయేవారు ప్రేక్షకులు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని నేరుగా తమకు ఇష్టమైన సినీ సెలబ్రిటీలతో మాట్లాడగలుగుతున్నారు అని చెప్పాలి. అయితే అటు సినీ నటులు కూడా అభిమానులతో సోషల్ మీడియాలో అప్పుడప్పుడు చిట్ చాట్ నిర్వహించడం లాంటివి చేస్తూ ఉన్నారు.


 అయితే ఇక ఇలా సెలబ్రిటీలు అభిమానులతో మాట్లాడుతున్న సమయంలో కొన్ని కొన్ని సార్లు నెటిజెన్స్ నుంచి వింత ప్రశ్నలు ఎదురవడం కూడా జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇలాంటివి జరిగినప్పుడు కొంతమంది సినీ సెలబ్రిటీలు తమ చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో చెప్పడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక మరి కొంతమంది సినీ సెలబ్రిటీలు ఏకంగా నేటిజన్స్ కి కౌంటర్ ఇస్తూ ఉంటారు అని చెప్పాలి. కానీ ఇక్కడ  శృతిహాసన్ మాత్రం నేటిజన్స్ అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పేసింది. ఏకంగా పర్సనల్ విషయాలను కూడా సోషల్ మీడియాలో పంచుకుంది అని చెప్పాలి. ఇటీవల సోషల్ మీడియాలో తన ఫాలోవర్లతో ఆస్క్ మీ ఎవ్రీథింగ్ అనే సెషన్ నిర్వహించింది శృతిహాసన్. అయితే ఇందులో నేటిజన్స్ అందరూ కూడా తిక్క ప్రశ్నలు అడిగారు. అయినప్పటికీ ఓపికగా సమాధానం చెప్పింది శృతిహాసన్. నువ్వు నీ యూరిన్ స్మెల్ చూసుకున్నావా.. స్నానం చేసేటప్పుడు పోస్తావా.. మిస్టేక్ లో ఎప్పుడైనా చెయ్ మీద పోసుకున్నావా అంటూ ఒక నేటిజన్ అడిగితే కంగారు పడకుండా స్నానం చేసేటప్పుడే పోస్తాను.. చేతి మీద ఎప్పుడు పడనివ్వలేదు. స్మెల్ కూడా చూడలేదు అంటూ సమాధానం చెప్పింది శృతిహాసన్. ఇక నీ గుండె ఏ కలర్ లో ఉంటుంది.. బ్లాక్ కలర్ లోనా అని మరో ప్రశ్న అడిగితే.. పింక్ కలర్ లో ఉంటుందేమో అని సెటైర్ వేసింది. డేటింగ్ కు రమ్మని కొంతమంది నేటిజన్స్ పిలిస్తే తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంటూ చురకలు అంటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: