తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరోలలో ఒకరు అయినటు వంటి నితిన్ ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో నితిన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయినప్పటికీ ఈ మూవీ బృందం ఎలాంటి హడా విడి లేకుండా ఈ మూవీ షూటింగ్ ను పూర్తి చేస్తూ వస్తుంది. ఈ మూవీ కి ఇప్పటి వరకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు.

 ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ఈ మూవీ కి ఈ చిత్ర బృందం సైతాన్ అనే టైటిల్ ను పెట్టే ఉద్దేశంలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఈ చిత్ర బృందం ఈ మూవీ టైటిల్ కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ విడుదలకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ ని ఈ సంవత్సరం వినాయక చవితి పండగ సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు ... అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే ఈ చిత్ర బృందం విడుదల చేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే నితిన్ ఆఖరుగా మాచర్ల నియోజకవర్గం అనే మూవీ లో హీరో గా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకో లేక పోయింది. ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో కృతి శెట్టి ... కేథరిన్ హీరోయిన్ లుగా నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: