సుకుమార్ - అల్లుఅర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న 'పుష్ప 2' షూటింగ్ అకస్మాత్తుగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ లతోపాటు సుకుమార్ ఇంట్లో కూడా ఐటీ రైట్స్ జరగడంతో ఉన్నపలంగా షూటింగ్ ఆపేశారు. దీంతో షూటింగ్ లేక ఇప్పుడు బన్నీ ఖాళీగా ఉండిపోయాడు. ఏకంగా ఐదు రోజులు షూటింగ్ లేదట. మరి ఈ టైం లో బన్నీ ఏం చేశాడు? అంటే ఆ టైంలో ముంబై వెళ్ళినట్టు తెలుస్తోంది. బన్నీ ముంబై వెళ్ళింది కూడా షూటింగ్ కోసమేనట. బాలీవుడ్ అగ్ర హీరో షారుఖ్ ఖాన్, అట్లీ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న 'జవాన్' సినిమాలో అల్లు అర్జున్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. 

అయితే ఈ మూవీ షూటింగ్ కోసమే బన్నీ సీక్రెట్ గా ముంబైలో ల్యాండ్ అయ్యాడట. ఇక ఈ ఐదు రోజులు జవాన్ షూటింగ్లో పాల్గొంటాడట బన్నీ. ఆ తర్వాత మళ్లీ హైదరాబాద్ వచ్చేసి పుష్ప2 షూటింగ్లో జాయిన్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న జవాన్ మూవీలో ఓ ఇంపార్టెంట్ రోల్ ఉంది. ఈ పాత్రను ముందుగా కోలీవుడ్ హీరో ఇలా తలపతి విజయ్తో చేయించాలని అనుకున్నారు. కానీ ఇది కుదరలేదు. ఆ తర్వాత బన్నీని సంప్రదించారు. అయితే ఆ సమయంలో బన్నీ రిజెక్ట్ చేసినట్లు కొన్ని వార్తలు వినిపించాయి. కానీ బాలీవుడ్ మీడియా మాత్రం జవాన్ లో బన్నీ ఉన్నాడంటూ కన్ఫామ్ చేస్తూ వరుస కథనాలు ప్రచురించారు.

కానీ ఇప్పటివరకు బన్నీ పిఆర్ టీం మాత్రం దీని గురించి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు బన్నీ ఉన్నటువంటి ముంబై కి వెళ్ళాడు అంటే కచ్చితంగా అది జవాన్ సినిమా షూటింగ్ కోసమే అని అంటున్నారు. మరి నిజంగానే బన్నీ జవాన్ షూటింగ్ కోసం ముంబై వెళ్ళాడా? లేదా వేరే పని మీద వెళ్లాడా? అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక పుష్ప2 లేటెస్ట్ షెడ్యూల్ ని మల్కాన్ గిరి ఫారెస్ట్ లో ప్లాన్ చేశాడు సుకుమార్. ఇటీవల బన్నీ కూడా షూటింగ్ లోకేషన్ కి వెళ్లాడు. అదే సమయంలో ఐటీ రైడ్స్ జరగడంతో షూటింగ్ నిలిపివేశారు. ఇక ప్రస్తుతం అర్ధాంతరంగా ఆగిపోయిన పుష్ప2 షూటింగ్ మే సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: