కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ కం హీరో విజయ్ ఆంటోనీ నటించిన 'బిచ్చగాడు' సినిమా ఎంత పెద్ద సెన్సేషన్ హిట్ అయిందో తెలిసింది. తమిళం తో పాటు తెలుగులోనూ ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాకి సీక్వెల్ కూడా అతి త్వరలోనే రాబోతోంది. 'బిచ్చగాడు 2' అనే టైటిల్ తో వస్తున్న ఈ మూవీలో విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. అతని భార్య ఫాతిమా నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఇక విజయ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ మే 19న తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల కాబోతోంది. ఇక రిలీజ్ టైం దగ్గర పడడంతో ప్రమోషన్స్ ని మొదలుపెట్టారు మూవీ టీం. ఈ క్రమంలోనే శుక్రవారం హైదరాబాదులో ప్రెస్ మీట్ నిర్వహించారు.

ప్రెస్ మీట్ లో హీరో విజయ్ ఆంటోనీ తో పాటు మూవీ యూనిట్ పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో భాగంగా విజయ్ మాట్లాడుతూ.. బిచ్చగాడు కథ విషయంలో జరిగిన వివాదంపై స్పందించాడు. "సింగపూర్ కు చెందిన ఓ వ్యక్తి బిచ్చగాడు 2 కథ నాదే అన్నాడు. చెన్నైకి చెందిన మరో ఇద్దరు వ్యక్తులు కూడా మాదే ఆ కథ అని అన్నారు. వీళ్ళు మాత్రమే కాదు చాలామంది ఈ కథ మాది అని వాదించారు. కానీ ఈ సినిమా కోసం బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ అనే కాన్సెప్ట్ ని తీసుకున్నాను. కథ దీనిపై ఉండదు. ఇప్పటికే బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీలపై 100కు పైగా కథలు ఉన్నాయి. నాది కూడా అలాంటి కథ అని వారంతా తప్పుగా అర్థం చేసుకున్నారు.

ఇక తర్వాత తమిళ హైకోర్టు విచారించి ఈ కథకు ఏ ఇతర కథలతో సంబంధం లేదని, ఇది పూర్తిగా భిన్నంగా ఉందని తీర్పు ఇచ్చింది" అంటూ చెప్పుకొచ్చాడు. ఇక బిచ్చగాడు అమ్మ సెంటిమెంట్. బిచ్చగాడు 2 సిస్టర్ సెంటిమెంట్ తో నడుస్తుంది. ఇక ఈ మూవీ షూటింగ్ సమయంలోనే తనకు పెద్ద ప్రమాదం జరిగిందని, నిజానికి ఆ ప్రమాదం తర్వాతే తాను మరింత శక్తివంతంగా మారానని పేర్కొన్నాడు. విజయ్ ఆంటోని ఇక ఇప్పటికే బిచ్చగాడు 2 నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. అలా భారీ అంచనాలతో విడుదల కాబోతున్న ఈ మూవీ ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: