పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ అనే పక్క కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... మైత్రి సంస్థ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యొక్క షూటింగ్ ప్రారంభం అయింది.

 అలాగే ఈ మూవీ మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయింది. ఈ మూవీ మొదటి షెడ్యూల్ లో పవన్ తో పాటు ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్న శ్రీ లీల కూడా జాయిన్ అయింది. అలాగే వీరిద్దరిపై ఇప్పటికే కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. ఈ సినిమాలో పవన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. అందులో భాగంగా ఈ మూవీ యూనిట్ ఫస్ట్ షెడ్యూల్ లో ప్రత్యేకంగా వేసిన పోలీస్ స్టేట్.లో పవన్ పై కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించింది.

మూవీ యొక్క రెండవ షెడ్యూల్ మరి కొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతోంది. ఇది ఇలా ఉంటే మే 11 వ తేదీన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుండి గ్లిమ్స్ వీడియోను విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే. తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా గ్లిమ్స్ వీడియోకు సంబంధించిన మరో అదిరిపోయే అప్డేట్ ను తాజాగా ప్రకటించింది. ఈ మూవీ నుండి ఫస్ట్ గ్లిమ్స్ వీడియోను సంధ్య 35 ఎం ఎం థియేటర్ లో మే 11 వ తేదీన సాయంత్రం 4 గంటల 59 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: