సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోతో అనుకున్న కథను మరో హీరోతో తెరకెక్కించడం అనేది చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అలాగే కొంత మంది హీరోలు రిజెక్ట్ చేసిన సినిమాలు కొన్ని సందర్భాలలో బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను సాధిస్తే ... అలాగే మరికొన్ని సందర్భాలలో కొన్ని మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన పరాజయాలను కూడా సాధిస్తూ ఉంటాయి.

ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం పెద్దగా అంచనాలు లేకుండా చిన్న సినిమాగా తక్కువ బడ్జెట్ సినిమాగా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్ లను వసూలు చేసినటువంటి బలగం సినిమాలో ప్రియదర్శి హీరోగా నటించిన విషయం మనకు అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గ నటించగా ... జబర్దస్త్ వేణు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ఈ సినిమాలో హీరోగా మొదట ప్రియదర్శి కంటే ముందే ఇతరులను అనుకున్నారట. వారు ఎవరో ..?  ఎందుకు ఆ సినిమాలో నటించలేదో తెలుసుకుందాం.

బలగం మూవీ కి జబర్దస్త్ వేణు దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. మొదట ఈ మూవీ లో వేణునే హీరోగా నటిద్దాం అనుకున్నాడట. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమాలో హీరోగా వేణు నటించలేకపోయినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత టాలీవుడ్ యువ హీరో శ్రీ విష్ణు ను ఈ సినిమాలో హీరోగా తీసుకుందాం అనుకున్నారట.

అందులో భాగంగా ఈ హీరో కు కథను కూడా వినిపించగా ... ఈ సినిమా కథ సూపర్ గా ఉంది కాకపోతే తెలంగాణ యాస నాకు కష్టం అవుతుంది అని సున్నితంగా ఈ సినిమా ఆఫర్ ను శ్రీ విష్ణు రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీ బృందం ప్రియదర్శి కి ఈ మూవీ కథను విరపించగా ... ఈ సినిమా కథ అద్భుతంగా నచ్చిన ప్రియదర్శి వెంటనే ఈ మూవీ లో హీరో గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇచ్చాడంట.

మరింత సమాచారం తెలుసుకోండి: