ప్రతి ఒక్కరూ పెట్టుబడి తక్కువ పెట్టాలి.. ఆదాయం ఎక్కువ రావాలి అని ఆలోచిస్తూ ఉండటం సహజం.. ఎందుకంటే ఎవరైనా సరే డబ్బును దాచుకోవాలని చూస్తారే తప్ప, పోగొట్టుకోవాలని చూడరు.. కాబట్టి ఏ దాంట్లో నైనా ఇన్వెస్ట్ చేసే ముందు , ఒకటికి రెండుసార్లు ఆలోచించిన తర్వాతనే, అందులో ఫుల్ సెక్యూర్ అనిపిస్తేనే డబ్బులు జమ చేయడానికి ముందడుగు వేస్తారు.. ఎందుకంటే ప్రతి రూపాయి కూడా కష్టపడందే రాదు కదా.! కాబట్టి ప్రతి కష్టానికి ఫలితం తప్పకుండా ఉండాలి.. అలా లేని నాడు వృధా అవుతుంది ..అనుకొని డబ్బులు ఆదా చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు.

ప్రతినెల ఆదాయం వచ్చేవారు రిటైర్మెంట్ తర్వాత.. సంతోషంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని ఆలోచిస్తారు. అందుకే అలాంటి వారి కోసం ఇప్పుడు భీమా దిగ్గజ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ సరికొత్త స్కీం తో కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది.. ఇందులో డబ్బులు చాలా జాగ్రత్తగా ఉండడం తో పాటు, నిర్ణీత కాలం ముగిసిన తర్వాత తప్పకుండా మన చేతికి ఎక్కువ మొత్తంలో డబ్బులు రావడం జరుగుతుంది. అంతేకాదు ప్రమాదవశాత్తు చనిపోతే , సంబంధించిన డబ్బులను కూడా ఇన్సూరెన్స్ కింద లబ్దిదారుడికి చెల్లించడం జరుగుతుంది..

ఇప్పుడు ఎల్ఐసి ప్రవేశపెట్టిన జీవన్ ప్రగతి పాలసీ కింద ప్రతి నెల 200 రూపాయల నుంచి ఆరు వేల వరకు ఈ పథకం లో జమ చేయవచ్చు.ఈ పాలసీని భారత బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI) ఆమోదించింది. ఇక ప్రతి నెల డబ్బులు పెట్టడం వల్ల మెచ్యూరిటీ కాలం ముగిసేసరికి చేతికి , 28 లక్షల రూపాయలు వస్తాయి. పెట్టుబడి పెట్టిన మొత్తం లో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి, ఈ మొత్తం రెట్టింపవుతుంది అనే  ఈ విషయాన్ని అందరూ గమనించాలి. ఒకవేళ భీమాడారుడు మరణిస్తే, ఈ డబ్బులు 200 శాతం నామిని కి వెళ్లి పోతాయి. కాబట్టి ఫుల్ సెక్యూరిటీ ఈ పథకం ..ప్రతి ఒక్కరికి లాభదాయకం అని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: