
రాష్ట్రవ్యాప్తంగా వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి పథకాలు అందించేలా చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరొక గుడ్ న్యూస్ తెలియజేసినట్లు తెలుస్తోంది ఆంధ్రాలో CRDA పరిధిలో నివసించే నిరుపేద ప్రజలకు ఏపీ ప్రభుత్వం శుభవార్తను అందించింది. భూమిలేని నిరుపేదలకు పెన్షన్ ని రెట్టింపు చేసే విధంగా ఆదేశాలను జారీ చేశారు.రేపటి నుంచే ఇందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా అమలు కాబోతున్నట్లు తెలిపారు. అమరావతి ap CRDA పరిధిలో భూమిలేని నిరుపేదలకు సైతం 2500 పించను అందిస్తూ ఉండగా మార్చి ఒకటి నుంచి 5000 చేస్తున్నారు..
సి ఆర్ డి ఏ పరిధిలోని 17,215 మంది లబ్ధిదారులకు మేలు జరుగుతుందని తెలిపారు. ఏపీలో త్వరలోనే రాబోతున్న ఎన్నికలలో అధికార పార్టీ ప్రతిపక్ష నేతల మధ్య వ్యూహాలతో ముందుకు వెళుతూ ఉన్నారు.. అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ గడపగడపకు మన ప్రభుత్వ మన కార్యక్రమాన్ని చేపట్టి దమ్ము చేసిన అభివృద్ధి పనులను కూడా వివరిస్తూ ఉన్నారు.. అయితే ప్రతిపక్ష నేతలు మాత్రం అధికార పార్టీని విమర్శిస్తూ ఉన్నారు.. అయితే అధికార పార్టీ మాత్రం అభివృద్ధి గా ముందుకు వెళ్లాలంటే మరికొన్ని పథకాలతో ఈసారి మీ ముందుకు వస్తామంటూ తెలియజేశారు.