హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా ఏదీ చేసినా సంచలనమే. సానియా పెళ్లి అనేది అప్పట్లో పెను సంచలనం అయింది. ఇప్పుడు ఆ మ్యారేజ్ ఎపిసోడ్ ను వెండితెరకు ఎక్కించే ప్రయత్నం జరుగుతోంది. ఇందులో సానియా మీర్జా మ్యారేజ్ ఎపిసోడ్ ను హై లెట్ చేస్తూ ఓ బాలీవుడ్ మూవీ తీయాలనుకుంటున్నారు దర్శక నిర్మాతలు. సానియా రోల్ ను బెంగాలీ ముద్దుగుమ్మ దేబినా బెనర్జీ చేయనుంది. షోయబ్ మాలిక్ క్యారెక్టర్ కోసం ఓ మంచి నటున్ని వెతుకుతున్నారు.
మరోవైపు.. ఇషా డియోల్ ముఖ్యపాత్రలో సానియామీర్జా నిజ జీవితాన్నే 'ఐ ఫర్ ఇండియా' టైటిల్ తో మరో చిత్రం తెరకెక్కనున్నట్లు బాలీవుడ్ సమాచారం. ఈ సినిమాను దర్శకుడు హేమంత్ దేశాయ్ తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. సానియా రియల్ లైఫ్ పై ఒకేసారి రెండు సినిమాలు తెరకెక్కుతున్నట్టు సమాచారం రావడంతో బాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది.
సానియా మీర్జా ఏదీ చేసిన ఓ ప్రత్యేకతతో పాటు కాంట్రవర్సీకూడా ఉంటుంది. టెన్నిస్ లో ఎన్ని సంచలనాలు సృష్టించిందో.. అన్ని వివాదాలకు కూడా కేంద్రబిందువైంది. ముక్యంగా సానియా మీర్జా పెళ్లి ఎపిసోడ్.. హై టెన్షన్ మధ్య హై డ్రామా చోటుచేసుకుంది. నేషనల్ మీడియానే కాదు. ఇంటర్నేషనల్ మీడియాకూడా సానియా మ్యారేజ్ కాంట్రవర్సీని హైలెట్ చేశాయి.
సానియా పెళ్లి ఓ సంచలనం. అంతకుముందు యంగేజ్ మెంట్ అయిన వ్యక్తితో బ్రేకప్ చేసుకుంది. షోయబ్ కూడా హైదరాబాదీ గర్ల్ ను పెళ్లాడంటూ వార్తలు వచ్చాయి. ఇదంతా.. రెండు వారాల పాటు హై డ్రామా నడిచింది. పెళ్లి ఎక్కడ జరుగుతుంది. పెళ్లి విశేషాలు ఎవీ తెలియకుండా మీడియాను తెగ ఇబ్బంది పెట్టారు. దీంతో రెండు వారాల పాటు సానియా మ్యారేజ్ ఎపిసోడే హైలెట్ అయింది. మొత్తానికి షోయబ్ మాలిక్ తో సానియా పెళ్లి ప్రశాంతంగా జరిగిపోయింది. తాజాగా తన జీవితంపై తెరకెక్కనున్న సినిమాలతో సానియా మరోసారి వార్తల్లోకి వస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి