యాంగ్రీ హీరోగా ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన రాజశేఖర్ ఆతరువాత తన ప్రాభవం పూర్తిగా కోల్పోవడంతో అతడిని హీరోగా నిలబెట్టాలి అని జీవిత సినిమాలు తీసి ఆమె ఆర్ధికంగా బాగా నష్టపోయింది. ఇలాంటి పరిస్థితులలో రాజశేఖర్ నటించిన ‘గరుడవేగ’ ఊహించని విజయం సాధించడంతో అతడి కెరియర్ కుదుట పడుతుంది అని భావించారు అంతా. 

అయితే ‘గరుడవేగా’ సక్సస్స్ అయినా రాజశేఖర్ కు అవకాశాలు రాలేదు. దీనితి జీవిత మళ్ళీ రంగంలోకి దిగి తన కూతురు శివాత్మికను నిర్మాతగా మార్చి సాహసంతో తీసిన ‘కల్కి’ విడుదల కాకుండానే జీవితకు లాభాలు తెచ్చి పెట్టడం సంచలనంగా మారింది. ‘కల్కి’ సినిమా థియేట్రికల్ రైట్స్ హోల్ సేల్ గా అమ్ముడుపోయిన విషయం తెలిసిందే. 

ఇక లేటెస్ట్ గా ఈ మూవీ శాటిలైట్ డిజిటల్ డీల్స్ కూడా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. గతంలో  ‘గరుడవేగ’ సినిమా విడుదలై హిట్ అయినంతవరకు శాటిలైట్ రైట్స్ ఎవరూ కొనలేదు. కానీ ‘కల్కి’ మాత్రం విడుదలకు ముందే ఈవిషయంలో బిజినెస్  పూర్తి చేకోవడం సంచలనంగా మారింది. 

తెలుస్తున్న సమాచారం మేరకు ‘కల్కి’ సినిమా శాటిలైట్ రైట్స్ ను స్టార్ మా ఛానెల్ దక్కించుకుంది అని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కూడ సొంతం చేసుకోవడంతో ఈ రెండు డీల్స్ ద్వారా జీవితకు 6 కోట్లు ఆదాయం వచ్చిందని చెపుతున్నారు. ప్రశాంత్ వర్మ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమా 28న థియేటర్లలోకి వస్తోంది. ఈమూవీ అనుకున్న విధంగా సక్సస్ అయితే తిరిగి రాజశేఖర్ కెరియర్ ట్రాక్ లోకి వచ్చింది అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: