తనదైన స్టైల్ తో నటనతో  తెలుగు ప్రేక్షకుల్లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని తెలుగు ప్రేక్షకులందరికీ మాస్ మహారాజ గా మారిపోయిన హీరో రవితేజ. టాలీవుడ్ లో ఎంత మంది హీరోలు వచ్చినప్పటికీ మాస్  హీరో అంటే టక్కున గుర్తొచ్చే పేరు రవితేజ. ఇకపోతే తాజాగా మాస్ మహారాజా రవితేజ విఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కో రాజా తెరకెక్కిన విషయం తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ గా... సరికొత్త త్రిల్లింగ్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న మాస్ మహారాజా రవితేజ డిస్కో రాజా సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. వైవిధ్యమైన   కథలకు తెలుగు ప్రేక్షకుల నుంచి ఎలాగూ మంచి ఆదరణ ఉంటుంది అందుకే డిస్కో రాజా సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు రవితేజ. 

 

 

 ఇకపోతే నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన డిస్కో రాజా సినిమా... ప్రేక్షకులని ఎంతవరకూ ఆకర్షించ కలిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాగా వచ్చిన డిస్కో రాజా సినిమా ప్రేక్షకులందరినీ మెప్పించింది అనే చెప్పాలి. ఇప్పటికే విఐ ఆనంద్ విభిన్నమైన రెండు సినిమాలు తెరకెక్కించినట్లు గానే ఈ సినిమాను కూడా అద్భుతంగా తెరకెక్కించి దర్శకునిగా తన పనితనం ఏంటో చూపించారు. ముఖ్యంగా ఈ సినిమాలో రవితేజ పర్ఫామెన్స్ అదిరిపోయేలా ఉంది. సినిమా మొత్తం డిస్కోరాజా పాత్ర హైలెట్గా నిలుస్తుంది. అయితే ఈ సినిమాలో డిస్కో రాజా రవితేజ పాత్రను అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు వి.ఐ ఆనంద్... మిగతా రెండు పాత్రల విషయంలో మాత్రం అంతగా జాగ్రత్తలు తీసుకోలేనట్లు కనిపిస్తోంది. మిగతా రెండు పాత్రలు మాత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. 

 

 

 

 అయినప్పటికీ సినిమా థ్రిల్లింగ్ గా  ముందుకు సాగుతుండటంతో ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా... ఎంతో ఆసక్తిగా సినిమా సాగుతూ ఉంటుంది. అయితే డిస్కో రాజా సినిమా సెకండ్ హాఫ్ కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోవడంతో డిస్కోరాజా సినిమాకు ఆవరేజ్ టాక్ వస్తోంది. అయితే సంక్రాంతి తర్వాత ఏ సినిమా విడుదల కు సిద్ధంగా లేకపోవడం... డిస్కో రాజా సినిమా రిలీజ్ సోలో కావడం.. ఇక కొత్త సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులు అందరూ ఇప్పటికే ఆన్లైన్లో టికెట్లు చాలావరకు బుక్ చేసుకోవడం... అంతేకాకుండా వీకెండ్ లో ఈ సినిమా విడుదల కావడం ఇలా అన్ని కలిసొచ్చి  డిస్కో రాజా మంచి కలెక్షన్లు రాబట్టవచ్చు అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. వీకెండ్ లో  కంప్లీట్ డ్రాప్  అయితే మాత్రం 22 కోట్ల పైన షేర్ సాధించడం అనేది కష్టం అవుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: