ఈరోజు జరుగుతున్న మహిళా దినోత్సవం సందర్భంగా పవన్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘వకీల్ సాబ్’ మూవీలోని పాట ‘మగువ మగువ నీ విలువ తెలుసా’ విడుదల చేసి ఈ మూవీ ప్రమోషన్ కు శ్రీకారం చుట్టారు. ఈ మూవీ స్థాయిని పెంచే విధంగా రామ జోగయ్య శాస్త్రి మహిళల విలువను తెలుపుతూ అందరికీ అర్ధం అయ్యే పదాలతో కూర్చిన ఈ పాట ఈరోజు జరుగుతున్న ఉమెన్స్ డే నాడు హైలెట్ గా మారుతోంది. 


''మగువా మగువా.. లోకానికి తెలుసా నీ విలువా'' అంటూ విడుదలైన ఈ ఫుల్ సాంగ్ రిలీజ్ అయిన కొద్ది సేపట్లోనే లక్షల సంఖ్యలో హిట్స్ వేల సంఖ్యలో లైక్స్ వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పవన్ కళ్యాణ్ లుక్ కు విపరీతమైన స్పందన రావడంతో పాటు ఇప్పుడు ఈ పాట ట్యూన్ అందరికీ విపరీతంగా నచ్చడంతో పవన్ అభిమానులు మంచి జోష్ లో ఉన్నారు. 

మూవీ క్లైమాక్స్ లో పవన్ చెప్పే డైలాగ్స్ ధియేటర్లకు వచ్చిన ప్రేక్షకుల నుండి విపరీతమైన స్పందన వచ్చేలా వేణు శ్రీరామ్ చాల శ్రద్ధ పెట్టి ఈ మూవీ డైలాగ్ వెర్షన్ వ్రాయించినట్లు టాక్. ఇప్పటికే ఈ మూవీలో నటిస్తున్న ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరైన నివేదా థామస్ పవన్ కు నటన విషయంలో సవాల్ విసురుతోంది అని వార్తలు వస్తున్నాయి. 


ఈ మూవీకి సంబంధించిన ఈరోజు విడుదలైన మొదటి పాటకు విపరీతమైన స్పందన రావడంతో దిల్ రాజ్మూవీ పై పెట్టుకున్న అంచనాలతో పాటు ఈ మూవీ మార్కెట్ కూడ బాగా జరిగే ఆస్కారం కనిపిస్తోంది. సాధారణంగా పవన్ సినిమాలకు యూత్ బాగా వస్తారు. అయితే ఈసారి పవన్ తన సినిమా విషయంలో మహిళా ప్రేక్షకులు కూడ ఇష్టపడే విధంగా తన మూవీలోని సన్నివేశాలను మలుచుకుంటూ మహిళల మెప్పును కూడ పొందబోతున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: