ఈ మధ్య రిలీజ్ అవుతోన్న సినిమా పాటలు వింటుంటే.. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరా అని తెలుసుకోవాలనిపిస్తోంది. ఎందుకంటే ట్యూన్స్ బాగున్నాయి. సాహిత్యం వినబడుతోంది. మెలోడీ ఉంది. మ్యూజిక్ లవర్స్ నే కాదు.. అందరినీ మెప్పిస్తున్న ఆ సంగీత దర్శకులు ఎవరో ఓ తెలుసుకుందామా.. 

 

ఈ మధ్య కాలంలో ఏ పాటకూ రానంత క్రేజ్ సామజవరగమనకు వచ్చింది. సంగీత దర్శకుడు తమన్ ను టాప్ చైర్ లో కూర్చోపెట్టింది. సిరివెన్నెల కలంకు పదును తగ్గలేదని నిరూపించింది. గాయకుడు సిద్ధ్ శ్రీరామ్ వాయిస్ అందరికీ పరిచయం అయిపోయింది. ఇదే తరహాలో మరిన్ని క్యాచీ సాంగ్స్.. ఎవరూ ఊహించని మ్యూజిక్ డైరెక్టర్ నుంచి వస్తున్నాయి. 

 

సామజ వరగమన తర్వాత తెలుగులో ఎక్కువ పాపులర్ అయిన సాంగ్ నీలినీలి ఆకాశం. యాంకర్ ప్రదీప్ హీరోగా అమ్రిత అయ్యర్ హీరోయిన్ గా పరిచయమవుతున్నారు. సినిమాపై పెద్దగా అంచనాల్లేకపోయినా.. చంద్రబోస్ రాసిన నీలినీలి ఆకాశం సాంగ్ కావాల్సినంత హైప్ తీసుకొచ్చింది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఇచ్చాడు. 

 

మనం.. సోగ్గాడే చిన్నినాయన లాంటి సూపర్ హిట్స్ తర్వాత అనూప్ రూబెన్స్ కు స్టార్డమ్ వచ్చింది. టెంపర్ తో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. నేనే రాజు నేనే మంత్రితో మరో మ్యూజిట్ హట్ ఇచ్చాడు. ఆ తర్వాత పైసా వసూల్.. హలో సినిమాలకు వినసొంపైన మ్యూజిక్ ఇచ్చినా.. సినిమాలు ఫ్లాప్ కావడంతో రేసులో అనూప్ వెనుకబడిపోయాడు. 

 

స్టార్ మ్యూజిక్ డైరక్టర్ అనిపించుకోవాలన్న కసితో అనూప్ ఉన్నాడు. 30రోజుల్లో ప్రేమించడం ఎలా.. నుంచి 3 పాటలు రిలీజ్ చేస్తే.. మూడూ బాగున్నాయి. అలాగే ఒరేయ్ బుజ్జిగా కోసం ఇచ్చిన ట్యూన్ కూడా ఆకట్టుకుంటోంది. సిద్ధ్ శ్రీరామ్ పాడగా.. సాంగ్ ప్రోమోను రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఈ సినిమాలు హిట్ అయితే అనూప్ కు స్టార్స్ నుంచి మరోసారి మలుపు రావడం ఖాయం. 

మరింత సమాచారం తెలుసుకోండి: