గత కొంతకాలంగా నాగార్జునకు కెరియర్ పరంగా ఏమాత్రం కలిసి రావడం లేదు. తనకు 60 సంవత్సరాలు దాటిపోయినా తాను ఇప్పటికీ ‘మన్మధుడు’ నే అని తెలుగు ప్రేక్షకులకు చెప్పాలని గత సంవత్సరం ప్రయత్నించినా తెలుగు ప్రేక్షకులు నాగార్జునను తిరస్కరించడంతో ‘మన్మధుడు 2’ ఘోరమైన ఫ్లాప్ గా మారింది. ఆ షాక్ నుండి తేరుకున్న నాగార్జున ఈ ఏడాది సమ్మర్ కు ‘వైల్డ్ డాగ్’ గా రావాలని ప్రయత్నిస్తూ ఈ మూవీలో ఏసిపి విజయ్ వర్మ పాత్రలో సరికొత్త లుక్ లో కనిపించడానికి తన లుక్ ను మార్చుకున్నాడు. ఈ మూవీ ఎన్ ఐ ఎ ఆఫీసర్ గా నాగ్ డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ లో సందడి చేయబోతున్నాడు. 

 

ఇక నాగచైతన్య సాయి పల్లవితో కలిసి నటిస్తున్న లవ్ స్టోరీ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నిర్మాణంలో ఉన్న ఈ మూవీ ఇంచుమించు పూర్తి కావడంతో ఈ మూవీ కూడ సమ్మర్ రిలీజ్ ను టార్గెట్ చేస్తుంది. ప్రస్తుతం వరస పరాజయాలతో సతమతమైపోతున్న అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ షూటింగ్ కూడ ముగింపు దశకు చేరుకోవడంతో ఈ మూవీని కూడ సమ్మర్ సీజన్ లో రిలీజ్ చేయాలని నిర్మాత అల్లు అరవింద్ పక్కా ప్లాన్ తో ఉన్నాడు. 

 

వాస్తవానికి ఈ మూడు సినిమాల మధ్య నెలనెల గ్యాప్ ఉండే విధంగా ముందుగా నాగచైతన్య తో సమ్మర్ రేస్ మొదలుపెట్టి మధ్యలో అఖిల్ కు ప్లేస్ ఇచ్చి చివరిగా నాగార్జున రావాలని పక్కా ప్లాన్ ఈ అక్కినేని హీరోలు చాల ముందుగానే వేసుకున్నారు. అయితే ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ తో సినిమాల రిలీజ్ డేట్స్ ఆగిపోవడంతో ఏ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో ఆ హీరోలకు కూడ తెలియని పరిస్థితులలో ఆ ఎఫెక్ట్ ఇప్పుడు అక్కినేని కాంపౌండ్ కు కూడ తగిలినట్లు టాక్. 

 

దీనితో ఈ సమ్మర్ సీజన్ లో ఇప్పటికే రిలీజ్ కు రెడీగా ఉన్న ఇన్ని సినిమాల మధ్య అక్కినేని కాంపౌండ్ కు సంబంధించిన ఈ మూడు సినిమాలలో ఈ సమ్మర్ సీజన్ లో ఒక్కరు సినిమా మాత్రమే విడుదల అయ్యే ఆస్కారం ఉంది. దీనితో ఈ ముగ్గురు అక్కినేని ఫ్యామిలీ హీరోలలో ఎవరు ఎవరికోసం త్యాగం చేస్తారు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ వినిపిస్తున్నాయి..    

 

మరింత సమాచారం తెలుసుకోండి: