పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీ ప్రారంభించినప్పుడు రాజకీయాలలో ఒక కీలక శక్తిగా ఆ పార్టీ ఎదుగుతుందని అంతాభావించారు. ఆతరువాత గత సంవత్సరం జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పవన్ తన సినిమా కెరియర్ ను కూడ వదులుకుని సుమారు ఒకసంవత్సరం పాటు జనం మధ్య తిరిగినప్పుడు కనీసం ‘జనసేన’ కు 10 అసెంబ్లీ స్థానాలు అయినా వస్తాయని చాలామంది ఊహాగానాలు చేసారు.


అయితే గతసంవత్సరం జరిగిన ఎన్నికలలో పవన్ పోటీ చేసిన రెండు చోట్లా పరాజయం చెందడమే కాకుండా పవన్ కు కేవలం 7 శాతం ఓట్లు మాత్రమే లభించడంతో పవన్ మ్యానియాకు ఓట్లు పడలేదు అన్నవిషయం స్పష్టమైంది. అయితే పట్టు వదలకుండా పవన్ తన రాజకీయ పోరాటాన్ని ఎన్నికల తరువాత కూడ కొనసాగిస్తున్నప్పుడు పవన్ నిర్వహించిన రోడ్డుషోలకు స్వచ్చందంగా వచ్చిన జనాన్ని చూసి విశ్లేషకులు కూడ ఆశ్చర్యపోయారు.ఇలాంటి పరిస్థితులలో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో కరోనా సమస్య రాకముందు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం నిర్భంద విధ్యా విధానం పై తన తీవ్ర అభ్యంతరాలు తెలుపుతూ ‘మననుడి మననది’ అంటూ ఒక ప్రజా ఉద్యమం చేపడితే కోస్త జిల్లాల ప్రజలు పవన్ కు పూలతో అఖండ స్వాగతం పలకడమే కాకుండా  హారతులు కూడ ఇచ్చారు. దీనితో పవన్ ‘మననుడి మననది’ ఉద్యమానికి ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది అంటూ చాలామంది భావించారు.


అయితే ఈసంఘటన జరిగి కొన్ని వారాలు కూడ అవ్వకుండానే లేటెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం విద్య పై ఆంద్రప్రదేశ్ లోని వివిధ జిల్లాలలో పిల్లల తల్లితండ్రులతో చేసిన సర్వేలో తల్లితండ్రులు తమ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్య కావాలి అంటూ 96.17 శాతం కోరుతుంటే కేవలం 3.05 శాతం తల్లితండ్రులు మాత్రమే తమ పిల్లలకు తెలుగు మీడియంలోనే చదువులు కావాలని పవన్ చెప్పిన ‘మన నుడి మన నది’ ఉద్యమానికి సపోర్ట్ చేసారు.


దీనితో పవన్ కళ్యాణ్ తెలుగు మీడియంలోనే చదువులు ఉండాలి అంటు లేటెస్ట్ గా చేపట్టిన సామాజిక ఉద్యమానికి జనం వచ్చారు కానీ పవన్ సిద్ధాంతాలకు మొగ్గు చూపలేదు అన్నవిషయం మరొకసారి స్పష్టం అయింది అంటూ పవన్ వ్యతిరేకులు పవన్ అభిమానులను ఇరుకున పెట్టె కామెంట్స్ చేస్తున్నారు. హైకోర్ట్ ఇంగ్లీష్ మీడియం నిర్భంద విద్య అనవసరం అని అభిప్రాయపడినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 17.85 లక్షల స్టూడెంట్స్ తల్లితండ్రులు ఈ కరోనా సమస్యను కూడ పట్టించుకోకుండా ఇంగ్లీష్ మీడియంకు జై కొట్టిన విధానాన్ని పరిశీలిస్తూ ఉంటే సగటు మనిషికి ఇంగ్లీష్ పై పెరిగిపోతున్న మోజుతో పాటు పవన్ చేపట్టిన సామాజిక ఉద్యమాన్ని కూడ పట్టించుకోలేదు అన్నవిషయం స్పష్టంగా కనపడుతోంది అంటూ కొందరు చేస్తున్న కామెంట్స్ పరిశీలించిన వారికి పవన్ సభలకు సామాజిక ఉద్యమాలకు అభిమానులు జనం వస్తారు కానీ పవన్ మాటలను సీరియస్ గా పట్టించుకోరా  అన్న అభిప్రాయం కలుగుతోంది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: