ఈ మధ్యకాలంలో ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. సామాన్యులు సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజా బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్  ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది. ఎంతో క్రేజ్ ఉన్న నటుడు.. ఎన్నో కష్టాలను చూసి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నటుడు ఆత్మహత్య చేసుకోవడం అందరిని  కలచివేసింది. అయితే కరోనా  వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత లాక్ డౌన్ అమలు అయినప్పటినుంచి ఈ ఆత్మహత్యలు మరింత ఎక్కువ ఎక్కువవుతున్నాయి అనే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు.. వ్యాపారవేత్తలు సామాన్య ప్రజలు ఇలా తేడా లేకుండా అందరూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 

 


 ఆత్మహత్యలకు మానసిక ఒత్తిడి లేదా ఆర్థిక సమస్యల వల్లే అనే  కారణాన్ని వైద్య నిపుణులు తేలుస్తున్నారు . అయితే ఆత్మహత్యలకు సంబంధించి లివింగ్ అండ్ డయింగ్ అనే పుస్తకంలో   సామాజిక శాస్త్రవేత్త దేవ్ నాథ్ పాఠక్ రాశారు . ఒంటరితనం అంటే సమాజం మొత్తం తనను ఒంటరి వాడిని చేసింది అనుకోవటం. ఇలాంటి భావన ఆత్మహత్యలు చేసుకునే వారిని మరింతగా ప్రోత్సహిస్తుంది అని ఈ పుస్తకంలో చెప్పారు. సమాజం తనను ఒంటరివాన్ని చేసింది అనే భావనను మరో విధంగా చెప్పాలంటే సామాజిక దూరం. ఇలా మనుషులకు  దూరంగా ఉండడం ఆత్మహత్యలకు పురిగొల్పుతుంది అన్నది ఆ పుస్తకంలో రాయి పడింది.. 

 

 ఇలా ఆత్మహత్య చేసుకుని చనిపోయిన తర్వాత సమాజం మొత్తం తమ  పై జాలి దయ చూపిస్తాయని.. తమ ఆత్మ హత్య కు తామే బాధ్యత వహిస్తాము అనే విషయాన్ని గ్రహిస్తే ఇలాంటి ఆత్మహత్యలు జరగవు అని లివింగ్ అండ్ డైవింగ్ అనే పుస్తకంలో సామాజిక శాస్త్రవేత్త దేవ్ నాథ్ పాఠక్ సూచించారు. అందుకే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు తన ఆలోచనల నుంచి బయట పడడానికి ప్రయత్నించాలి తప్ప.. ఆ ఆలోచనకు మరింత బలంగా మార్చుకో వద్దు అని అంటున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: