ప్రస్తుతం షూటింగ్ లు లేకపోవడంతో టాప్ హీరోలు అంతా తాము భవిష్యత్ లో నటించే సినిమాల కథల విషయమై నటీనటుల ఎంపిక విషయమై తమ సినిమాల దర్శకులతో చాల లోతుగా చర్చలు జరుపుతున్నారు. దీనితో టాప్ హీరోల భవిష్యత్ సినిమాలకు సంబంధించిన కథ విషయమై ఆమూవీల బడ్జెట్ విషయమై అదేవిధంగా కీలక నటీనటుల ఎంపిక విషయమై అనేక చర్చలు ఒకటికి పది సార్లు జరుగుతున్నాయి అని టాక్.


ఇటువంటి సమయంలో ఈమధ్య త్రివిక్రమ్ జూనియర్ లు త్వరలో ప్రారంభించబోయే తమ మూవీ ‘పోయి రావలె హస్తిన’ కు సంబంధించి చాల లోతుగా చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈచర్చలలో జూనియర్ ఈ సినిమాను వీలైనంత తక్కువ బడ్జెట్ లో తీయమని ఈ మూవీని పాన్ ఇండియా మూవీగా ప్రమోట్ చేయకుండా కేవలం పూర్తిగా ఒక తెలుగు సినిమాగా మాత్రమే ప్రమోట్ చేస్తూ వీలైనంత తక్కువ ఖర్చుతో ఈ మూవీని పూర్తి చేయమని సలహా ఇచ్చినట్లు  టాక్.


అంతేకాదు గతంలో తాను నటించిన ‘బృందావనం’ మూవీలా ఈ మూవీ పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉండే పరిస్థితులలో ఈమూవీకి అనవసరపు ఖర్చులు భారీ సెట్లు వేయవద్దని జూనియర్ త్రివిక్రమ్ కు కొన్ని సూచనలు ఇచ్చినట్లు గాసిప్పులు వస్తున్నాయి. సాధారణంగా త్రివిక్రమ్ ఒక సినిమాకు సంబంధించి లక్ష ఖర్చు పెట్టవలసిన చోట 10 లక్షలు ఖర్చు పెడతాడు అన్న ప్రచారం ఉంది.


అయితే ఇప్పుడు జూనియర్ తనకు లేటెస్ట్ గా ఇచ్చిన ఈ సరికొత్త సూచనలతో ఈ మూవీ బడ్జెట్ ను ఎంతవరకు ఎలా తగ్గించగలం అన్న విషయంలో ప్రస్తుతం తన టీమ్ తో చర్చలు జరుపుతున్నట్లు టాక్. దీనితో జూనియర్ కు పాన్ ఇండియా ఇమేజ్ పై మోజు తగ్గిందా లేకుంటే ప్రస్తుత కరోనా పరిస్థితుల మధ్య తన సినిమాలకు కూడ మార్కెటింగ్ సమస్యలు వస్తాయని ముందుగానే ఊహించి తారక్ ఇలా త్రివిక్రమ్ కు సూచనలు ఇచ్చాడా అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: