గతంలో మణిరత్నం సినిమాలలో ఆఫర్ వస్తే చాలు అని ఎందరో టాప్ హీరోలు భావిస్తూ ఉండేవారు. గత కొన్ని సంవత్సరాలుగా మణిరత్నం హవా టాలీవుడ్ లో బాగా తగ్గిపోవడంతో ప్రస్తుతం మణిరత్నం మ్యానియా టాలీవుడ్ ఇండస్ట్రీలో చాల తక్కువగా ఉంది. కొంతకాలం క్రితం మణిరత్నం మహేష్ తో ఒక మూవీ అదేవిధంగా రామ్ చరణ్ తో మరొక మూవీ చేయాలని ప్రయత్నించినా ఈప్రముఖ దర్శకుడి ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు.
ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం మణిరత్నం ఆలోచనలో ఉన్న భారీ సినిమా ‘పోన్నియన్’ విషయాన్ని పక్కకుపెట్టి ‘నవరస’ పేరుతో తొమ్మిది భాగాలుగా ఉండే ఒక వెబ్ సిరీస్ ను తీయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈ వెబ్ సిరీస్ లో నటించడానికి టాలీవుడ్ టాప్ హీరో సూర్యాతో పాటు సిద్ధార్థ్ అరవింద్ స్వామి లు నటించడానికి ఒప్పుకున్నారు. ఈవెబ్ సిరీస్ ను తెలుగు తమిళ భాషలలో నిర్మించడానికి మణిరత్నం ప్లాన్ చేస్తున్నాడు.
ఈవెబ్ సిరీస్ లో నటించడానికి నాగచైతన్య నాని లను మణిరత్నం ఈమధ్య సంప్రదించినప్పుడు వారిద్దరు సున్నితంగా మణిరత్నం ఆఫర్ ను తిరస్కరించినట్లు టాక్. అంతేకాదు ఇప్పట్లో తమకు వెబ్ సిరీస్ లలో నటించే ఉద్దేశ్యం లేదని చెప్పినట్లు తెలుస్తోంది.
అయితే దక్షిణాది సినిమా రంగంలో టాప్ క్రేజ్ లో కొనసాగుతున్న సూర్య అరవింద్ స్వామి లకు లేని భయాలు మన టాలీవుడ్ హీరోలకు మణిరత్నం విషయంలో ముఖ్యంగా వెబ్ సిరీస్ ల విషయంలో ఏవిధంగా ఉన్నాయో ఈ సంఘటను బట్టి అర్ధం అవుతుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. జీవితంలో నవరసాలకు ఉండే ప్రాముఖ్యత చుట్టూ అల్లబడిన ఈకథ చాల వెరైటీగా ఉంటుంది అని అంటున్నారు. విభిన్న వెరైటీ కథలలో నటించే విషయంలో సాహసాలు చేసే నాని కూడ మణిరత్నం వెబ్ సిరీస్ విషయంలో వెనకడుగు వేయడం బట్టి ఇప్పట్లో మన టాలీవుడ్ హీరోలు వెబ్ సిరీస్ ల వైపు అడుగులు వేయరు అన్న విషయం స్పష్టం అవుతోంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి