రామాయణం అంటే.. ఓ రాముడు.. ఓ సీత.. ఓ రావణాసుడు. అందరికంటే ముందుగా రాముడు దొరికేశాడు. దర్శకుడు ఓం రౌత్‌ మదిలో మెదిలిన రాముడు ప్రభాస్‌ కాగా... రావణాసురుడు సైఫ్‌ అలీఖాన్‌. ఎంత ట్రై చేసినా.. రాముడు పక్కన సీత సెట్‌ కావడం లేదు. మరి ఆయన పరిశీలనలో వచ్చిన పేర్లా? లేదంటే.. పుకార్లో తెలియదు గానీ.. సీతగా ఒక్కోవారం ఒక్కో హీరోయిన్‌ పేరు  బయటకు వస్తోంది.

దర్శకుడు ఓం రౌత్‌ రాముడిని ఈజీగా సెలెక్ట్‌ చేసేశాడు గానీ.. సీత పాత్రకు ఎవరిని సెలెక్ట్ చేయాలో తెలియని అయోమయంలో ఉన్నాడు. ముందుగా కీర్తి సురేష్‌ పేరు వినిపించింది. ఆది పురుష్‌ ఎనౌన్స్‌ చేసి వారం తిరగకుండానే.. సీత ప్లేస్‌ను కియారా అద్వానీ ఆక్రమించింది. కబీర్‌సింగ్‌తో ఇన్నోసెంట్‌గా కనిపించి ఆకట్టుఉన్న కియారా  అయితే బాగుంటుందని దర్శకుడు ఫీలయ్యాడేమో.

ప్రభాస్‌ రాముడైతే.. సీత ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరక్కపోయినా.. లేటెస్ట్‌గా అనుష్క శర్మ పేరు ట్రోలింగ్‌ అవుతోంది. ప్రస్తుతం  ప్రెంగ్నెంట్‌గా వున్న ఆమె  పేరు రావడంతో నెటిజన్లు షాక్‌ అయ్యారు. జనవరిలో డెలివరీ డేట్‌ ఇచ్చారని.. ఆదిపురుష్‌ మొదలయ్యేనాటికి అనుష్క రెడీ అవుతుందన్న ప్రచారం నడుస్తున్నా..ఈ వార్తను నెటిజన్లు మాత్రం నమ్మడం లేదు.

ఆదిపురుష్‌కు జోడీ ఎక్కడ ఉందోగానీ...వారానికో పేరు తెరపైకి వస్తోంది. ఇప్పటికే.. కీర్తిసురేష్‌.. కియారా.. అనుష్క శర్మ పేర్లు వచ్చేశాయి. కొత్తగా వచ్చే పేరు కోసం నెటిజన్లు వెయిట్ చేస్తున్నారు. అటు ఇటూ తిరిగి.. శ్రీరామరాజ్యంతో ఉత్తమ సీతగా అవార్డు అందుకున్న నయనతార పేరు వస్తుందేమో చూడాలి.

పాన్ ఇండియన్ మూవీ ఆదిపురుష్ పై ఎన్నో అంచనాలున్నాయి. ప్రేక్షకులు ఈ సినిమాపై ఎమో ఊహించుకుంటున్నారు. అంతేకాదు రామాయణం గాథను ఆదిపురుష్ పేరుతో తెరక్కెక్కడంతో ఈ సినిమాపై సినీ అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. రాముడు పాత్రలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓకే.. కానీ సీత ఎవరు అనే దానిపై క్లారిటీ రావడం లేదు.






మరింత సమాచారం తెలుసుకోండి: