టాప్ హీరోల భార్యలు కూడ ఇప్పడు సెలెబ్రెటీలుగా మారిపోతున్న పరిస్థితులలో స్టార్ హీరోల భార్యలకు సంబంధించిన వార్తలు కూడ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ముఖ్యంగా నమ్రత ఉపాసన సమంతలు స్టార్ హీరోల భార్యలుగా మాత్రమే కాకుండా తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఎర్పరుచుకున్నారు. ఉపాసన సమంత లకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయర్స్ కూడ ఉన్నారు.


సెలబ్రిటీలు మాత్రమే కాదు వారి భార్యలు ఏంచేసినా జనంలోకి వెంటనే వెళ్ళిపోతుంది. సామాజిక సేవ అవేర్ నెస్ కి సంబంధించిన విషయాలలో వీరు ఏమిచేసినా వారిని అనుసరించేందుకు అభిమానులతో జనం కూడ ఆశక్తిని కనబరుస్తారు. ప్రస్తుతం సమంత అక్కినేని ఉపాసన కొణిదెల వీరిద్దరూ సామాజిక సేవల్లో బిజీగా గడిపేస్తూనే అవసరం ఉన్నవారిని ఆదుకునే ప్రయత్నం చేయడం ఒక హాబీ గా మార్చుకున్నారు.


అక్కినేని కోడలు సమంత హీరోయిన్ గా కాలం గడుపుతునే ప్రత్యూష సామాజిక సంస్థ కార్యకలాపాల ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తోంది. అదేవిధంగా ఉపాసన అపోలో హెల్త్ ఆర్గనైజర్ గా మ్యాగజైన్ ఎడిటర్ గా చాలా సామాజిక సేవలు చేస్తూ అనేక గుర్తింపులు కూడ పొందింది.  ముఖ్యంగా ఉపాసన అనేక  అవేర్ నెస్ కార్యక్రమాలు  నిర్వహిస్తోంది.  


అలాంటి వీరిద్దరూ కలసి మర్రిన్ని మంచిపనులకు శ్రీకారం చుట్టడం ఇప్పడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ‘సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే అత్యంత దయగల శక్తివంతమైన స్టార్ భార్యలు అద్భుతాల కోసం వస్తున్నారు. వేచి ఉండండి! @ Urlife.co.in ను అనుసరించండి’ అంటూ సోషల్ మీడియాల్లో వీరిద్దరూ షేర్ చేసిన ఒక మెసేజ్ సంచలనంగా మారింది.  రానున్నరోజులలో సమంత ఉపాసన జోడీ ఈ వేదిక ద్వారా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు అంటూ అప్పుడే ఊహాగానాలు కూడ మొదలయ్యాయి. వీరిద్దరి స్పూర్తితో రానున్న రోజులలో  మరితమంది స్టార్ హీరోల భార్యలు సమాజ సేవలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: