ప్రణీత ప్రాణాయామం చేస్తున్న వీడియోలో.. ఏదో ఒక సౌండ్ ఆమెను డిస్ట్రబ్ చేస్తుంది. అయితే పదే పదే ఆ సౌండ్ డిస్ట్రబ్ చేస్తుంటే.. ప్రణీత చివర్లో మీరు కూడా అది విన్నారా..? ఎక్కడినుంచి వచ్చిందో అంటూ ఆశ్చర్యపడుతున్నట్టు స్టేట్ మెంట్ ఇస్తుంది. "స్టార్ట్ యువర్ డే విత్ సౌండ్ ఆఫ్ స్ట్రెంత్" అంటూ ఓ మెసేజ్ ఇచ్చి వీడియోని కంప్లీట్ చేసింది ప్రణీత. అంటే.. ఆమె త్వరలో మొదలు పెట్టబోతున్న ప్రోగ్రామ్ కి ఇది కర్టెన్ రైజర్ అన్నమాట.
హీరోయిన్ ప్రణీత కొత్త ప్రోగ్రామ్ మొదలు పెట్టబోతున్నారని, దానికి సంబంధించి టీజర్ గా దీన్ని రిలీజ్ చేశారని అంటున్నారు. అయితే ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం కూడా ప్రణీత కొన్ని కాన్సెప్ట్ లు రెడీ చేసిందని సమాచారం. ప్రస్తుతం ప్రణీత ఇచ్చిన టీజర్ దేనికి సంబంధించింది అనే విషయాన్ని మాత్రం ఆమె ఇంకా బైటపెట్టలేదు. సినిమాల్లో డీసెంట్ రోల్స్ చేసిన ప్రణీత, కరోనా టైమ్ లో తన పెద్దమనసు చాటుకుంది. సోనూసూద్ అంత కాకపోయినా.. వలస కూలీలకు ఆహారాన్ని అందించింది. వారి ఆకలి చూసి తట్టుకోలేక తనే స్వయంగా వంట వండి, వలస కూలీలకు పంచి పెట్టింది. లాక్ డౌన్ సేవకిగా పేరు సంపాదించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి