కోవిడ్ పరిస్థితుల నేపధ్యంలో ఇండియాలో అన్ని భాషలకు సంబంధించిన సినిమా షూటింగ్ లు ఆగిపోవడంతో నిర్మాతలకు వేల కోట్లల్లో నష్టం వచ్చింది అన్న వార్తలు వస్తున్నాయి. ఒక్క టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి తెలుగు రాష్ట్రాలలోని నిర్మాతలకు ప్రస్తుత పరిస్థితులు వల్ల 1000 కోట్లకు పైగా నష్టం వచ్చిందని అంచనాలు వస్తున్నాయి.


ఇలాంటి పరిస్థితులలో టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కొందరు ప్రముఖులు మన నటీనటులకు ఇచ్చే పారితోషికంలో 20 శాతం కోత విధించకపోతే సినిమాలు తీయడం కష్టం అన్న అభిప్రాయం స్పష్టంగా చెప్పినా మన టాప్ హీరోలు ఎవరు ఈ విషయమై ఇప్పటి వరకు స్పందించలేదు. ఇలాంటి పరిస్థితులలో ప్రముఖ దర్శకుడు నిర్మాత భారతీయ రాజా తమిళనాడు నిర్మాతల మండలి తరఫున కోలీవుడ్ హీరోలకు చేసిన హెచ్చరికలు మన టాప్ హీరోలకు గుబులు పుట్టించి తీరుతాయి.


ప్రస్తుతం తమిళనాడులో నిర్మాణంలో ఉన్న అన్ని సినిమాలలో నటిస్తున్న నటీనటులు టెక్నీషియన్స్ ఇచ్చే పారితోషికంలో 30 శాతం కోత విధిగా విధిస్తున్నామని 10 లక్షల పారితోషికం పైన తీసుకునే నటీనటులు టెక్నీషియన్స్ అందరికీ ఈ రూల్ వర్తిస్తుందని భారతీ రాజా తెగేసి చెప్పాడు. దీనితో భారతీ రాజా నిర్ణయాన్ని వెతిరేకించే సాహసం కోలీవుడ్ లోని టాప్ హీరోలు చేయగలరా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.  


వాస్తవానికి ఇలాంటి డిమాండ్ టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలోని అనేకమంది నిర్మాతల నుంచి వస్తున్నప్పటికీ ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొనసాగుతున్న టాప్ హీరోల ఆదిపత్యం ముందు ఈ డిమాండ్ వెలవెల పోతోంది. అయితే ఇప్పుడు భారతీయ స్పూర్తితో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని నిర్మాతలు అంతా ఒక త్రాటి పైకి తీసుకు రాగలిగితే టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన నటీనటులకు సంబంధించిన భారీ పారితోషికాలకు చెక్ పడే అవకాశం ఉంది అన్న కామెంట్స్ వస్తున్నాయి. అయితే భారతీయ రాజా లాంటి రేంజ్ ఉన్న వ్యక్తి ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఎవరు ఉన్నారు అన్నది తెలియాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: