బాలీవుడ్ మల్టీస్టారర్ ఫిలింస్ కు పెట్టింది పేరు. అందరూ అందరితో చేస్తారుగానీ కొందరు మాత్రం కొందరితో కలవడానికి ఎందుకనో తటపటాయిస్తుంటారు. మరి ఆ రోజుల్లో కలిసినా ఇప్పుడేం చేసినా స్టేజ్ షోలపైనా కలిసి కనిపిస్తున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి షారుక్ ,సల్మాన్ లు వచ్చిచేరతారు. కెరియర్ స్టార్టింగ్ లో మల్టీస్టారర్ ఫిలింస్ లో మెరిసిన వీరిద్దరు ..ఆ తర్వాత కాలంలో అంతగా కలిసి నటించింది లేదు. జస్ట్ గెస్ట్ అప్పిరియన్స్ తోనే అలా మెరిసి మాయమయ్యేవారు.
వెండితెరపై మరోసారి షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు కలిసి నటించడమంటే ఫ్యాన్స్ కు అది పెద్ద పండగే. షారూఖ్ సినిమాలో సల్మాన్ కూడా ఉంటారని, ఈ విషయాన్ని షారూఖ్ స్వయంగా ప్రకటిస్తారని అంటున్నారు. ఇప్పటికే ఈ ఫిలింలో జాన్ అబ్రహామ్, దీపికా పదుకొనే వంటి స్టార్స్ ఉండగా, ఇప్పుడు మరో సూపర్ స్టార్, సల్మాన్ భాగం కావడంతో, ఇది మెగా మల్టీ స్టారర్ గా మారిందని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
షారూఖ్ తో ఇంతకుముందు 'జీరో'లో సల్మాన్ ఓ చిన్న కామిక్ రోల్ చేశాడు. ఆ తర్వాత వీరిద్దరూ అంతగా కలిసి చేసిన సినిమా లేదు. అయితే అప్పట్లో కరన్ అర్జున్, 'కుచ్ కుచ్ హోతాహై', 'ఓమ్ శాంతి ఓమ్', 'హర్ దిల్ జో ప్యార్ కరేగా' వంటి ఫిలింస్ లో ఇద్దరూ కలిసి నటించారు. ఈ కొత్త సినిమా షూటింగ్ పనులు ఈ నెలలోనే మొదలవుతాయని, న్యూయార్క్ లో సైతం షూటింగ్ కు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి