కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. వీటిలో సినిమా రంగం కూడా ఉంది. నెలల కొద్ది లాక్‌డౌన్ విధించడంతో సినిమా షూటింగ్‌లన్నీ ఆగిపోయాయి. దీంతో చాలా మంది పేద కళాకారులు, సినీ కార్మికులు ఉపాధిని కోల్పోయారు. కరోనా వైరస్ కారణంగా సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. సినీ ఇండస్ట్రీ పూర్తిగా పనిచేయడం ఆగిపోయింది కాబట్టి రోజువారీ వేతనానికి పనిచేసే కార్మికుల పరిస్థితి దారుణమైన స్థితికి చేరుకుంది. కరోనా వల్ల మార్చిలో సినిమా థియేటర్లను మూసేశారు.

లాక్ డౌన్ పేరుతో ఎక్కడ షూటింగ్స్ అక్కడ ఆగిపోవడంతో అటు నిర్మాతలు కూడా కుంగిపోయారు. షూటింగ్ ఆగిపోవడం వలన... అప్పటికే మొదలైన సినిమాల చిత్రీకరణ కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు నిర్మాతలు. అంత పెద్ద మొత్తం కోసం అప్పులు చేసి మరీ షూటింగ్ చేసి ఉంటారు. సినిమాలు రిలీజ్ అయితే కాని ఆ అప్పులు తీరే పరిస్థితి లేకపోవడంతో..నిర్మాతలు దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. అప్పు చేసిన కోట్లాది రూపాయలకు వడ్డీలు కడుతూ నష్టపోయారు. దాదాపు ఏడు నెలల సుదీర్ఘ కాలం తర్వాత కేంద్ర ప్రభుత్వం షూటింగులకు... థియేటర్స్ తెరవడానికి అనుమతి ఇచ్చిన పరిస్థితి కాస్త అటు ఇటు గానే ఉంది. సినిమా థియేటర్స్ అయితే ఓపెన్ చేసారు కానీ కోవిడ్ నిబంధనలను  పాటించాలంటూ షరతు పెట్టారు.

దీంతో థియేటర్స్ 50 శాతం ఆక్యుపెన్సీ తో మాత్రమే నడపాల్సి ఉండడంతో నిర్మాతలు సినిమా విడుదల చెయ్యడానికి వెనకడుగు వేస్తున్నారు. కనీసం సినిమా నిర్మాణానికి  అయిన ఖర్చు అయినా వెనక్కి వస్తుందా..!!! అన్న ఆలోచనలో పడ్డారు. దీంతో.. క్రిస్మస్ కి కూడా థియేటర్లు తెరచుకునే పరిస్థితి లేదు. సంక్రాంతి కి కూడా మన అభిమాన తారల సినిమాలు హ్యాండ్ ఇచ్చే ప్రమాదం కనిపిస్తోంది. కరోనా వ్యాక్సిన్ వచ్చేవరకు థియేటర్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా కనిపిస్తోంది. లాక్ డౌన్ సమయంలో అప్పటికే షూటింగ్ను పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమాలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అదే సమయంలో ఓ టి టి  వేదికల ద్వారా కాస్త ఊరట కలిగింది.

అమేజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, జీ 5, ఆహా లాంటి ఓటీటీ ప్లాట్ ఫామ్ ల వేదికగా పలు సినిమాలు రిలీజ్ అయి నిర్మాతలను కాస్త కుదుట పడేలా చేశాయి. థియేటర్లు మూతపడ్డ పరిస్థితుల్లో ఆర్థిక భారం మోయలేని నిర్మాతలను ఆదుకున్నవి ఓటీటీలే. వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో అందేవరకు థియేటర్లు పూర్వవైభవం అందుకునేలా కనిపించడం లేదు. ఇక అలాంటి పరిస్థితుల్లో మన అగ్ర హీరోల సినిమాలు సైతం ఓ టి టి వేదికపైనే రిలీజ్ అవనున్నాయంటూ టాక్ నడుస్తోంది. ఇప్పటికే ప్రేక్షకులు  ఓ టి టి వేదికకు అలవాటు పడిపోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరి థియేటర్ల పరిస్థితి ఏంటి..??? ఈ ఏడాది సినీ పరిశ్రమ కారణంగా నష్టపోయిందని సినీ పెద్దలు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: