అయితే ఈ మధ్య కాలంలో హైపర్ ఆది కేవలం జబర్దస్త్ లోనే కాకుండా ఇతర అన్ని ఈవెంట్ కూడా తనదైన కామెడీ టైమింగ్ తో అదరగొడుతు బుల్లితెర ప్రేక్షకులకు ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ టీవీలో ప్రసారమయ్యే డాన్స్ రియాలిటీ షో ఢీ లో మొన్నటి వరకు వర్షిణి తో కలిసి ఒక వైపు టీం లీడర్ గా కొనసాగాడు హైపర్ ఆది కి ఇప్పుడు డీ13 లో సుడిగాలి సుధీర్ హైపర్ ఆది కలిసి టీం లీడర్ గా చేస్తున్నాను. అయితే ఢీ షోలో వర్షిని తో కలిసి జంటగా హైపర్ ఆది టీం లీడర్ గా కొనసాగే సమయంలో ఈ జంటకీ ఎంతగానో క్రేజ్ వచ్చింది.
ఈ క్రమంలోనే ఈ జంట ఈటీవీ లో ప్రసారమయ్యే పలు ఈవెంట్ లలో కూడా కలిసి డాన్స్ పెర్ఫార్మన్స్ లు చేసి బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షించింది. ఇక ఇటీవల న్యూఇయర్ సందర్భంగా ఈ టీవీ యాజమాన్యం ప్లాన్ చేసిన సరికొత్త ఈవెంట్ కు సంబంధించిన ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక సీనియర్ ఎన్టీఆర్ సాంగ్ ఆకు చాటు పిందె తడిసే అనే పాట పై హైపర్ ఆది డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఆది తో కలిసి అటు జూనియర్ శ్రీదేవి లాగా గెటప్ వేసిన వర్షిని కూడా తన డాన్స్ తో అదరగొట్టింది. ఇక హైపర్ ఆది అచ్చం అన్న గారి లాగా ఓల్డ్ గెటప్ వేసి సాంగ్ లో అదరగొట్టాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి