
స్టార్ హీరోయిన్అక్కినేనిసమంత గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. సమంతఅక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకుంది. సమంత వివాహానికి ముందు సిద్ధార్థతో ప్రేమాయణం జరిపిన విషయం అందరికి తెలిసిందే. ఇదే విషయమై టాలీవుడ్ లో ఎంతో మంది హీరో హీరోయిన్లు గాఢంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్ని జంటలు పెళ్లి పీటలు వరకు వచ్చి ఆగిపోయాయి. అలాంటి గాథలలో సమంతసిద్ధార్థ్ ల ప్రేమ వ్యవహారం కూడా ఒకటి.
అప్పట్లో సిద్ధార్థ-సమంత లు చాలా రోజులు డేటింగ్ కూడా చేశారని, వారి ప్రేమ చివరకు పెళ్లి పీటలు ఎక్కబోతోందని కోలీవుడ్ లో చాలా ప్రచారాలు జరిగాయి. అయినప్పటికీ సిద్ధార్థ వారి ప్రేమ విషయాన్ని బయటకు చెప్పడానికి అంగీకరించలేదు. కానీ సమంత మాత్రం ఆ విషయం రాగానే ఒక చిరునవ్వు నవ్వి మా ప్రేమను ఎంజాయ్ చేస్తున్నామని చెప్పేది.
ఆ తరువాత కొన్ని కారణాల చేత వీరిద్దరూ విడిపోవాల్సి వచ్చింది.వీరిద్దరూ కలిసి కేవలం రెండు సినిమాల్లో మాత్రమే నటించారు. 2013వ సంవత్సరంలో విడుదలైన జబర్దస్త్ తోపాటు డుం డుం పీ పీ అనే రెండు సినిమాలలో నటించారు. ఈ సినిమాలు ఘోర పరాజయాన్ని చవిచూసాయి.ఈ రెండు సినిమాలు చేస్తున్న సమయంలోనే సిద్ధార్థ-సమంతల మధ్య ప్రేమ మొదలైంది.అయితే ఇన్ని రోజులు ఈ వార్తలన్నీ సోషల్ మీడియాలో కేవలం గాసిప్స్ గా నిలిచాయి. వీటికి ఎలాంటి ఆధారాలు లేవు.
కానీ సమంత గత కొంత కాలం గా ఆహా చానల్లో సామ్ జామ్ అనే ప్రోగ్రాం చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ షోకి టాలీవుడ్ స్టార్ హీరోలు తోపాటు స్టార్ హీరోయిన్లు కూడా హాజరవుతుంటారు. ఈ షోలో ఆమె తన జీవితంలో గడిపిన కొన్ని సంఘటనలు బయటపెట్టింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సమంత మాట్లాడుతూ.. " హీరో సిద్ధార్థతో నేను ప్రేమాయణం నడిపిన సంగతి వాస్తవమే,కానీ నేను సిద్ధార్థను పెళ్లి చేసుకుని ఉంటే నా జీవితం మరో సావిత్రి గారి జీవితంలా ఉండేది.ఈ విషయమై నిరాశ పడుతున్నప్పుడు నాగచైతన్య నాకు దగ్గరయ్యాడు. మా ఇరువురి మధ్య అనుబంధం ప్రేమగా మారి చివరకు పెళ్లి చేసుకునేలా చేసింది. నాగ చైతన్య ను పెళ్లి చేసుకోవడం దేవుడు నాకు ఇచ్చిన వరం, ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి ఇలాంటి భర్త దొరికాడు. "అంటూ చెప్పుకొచ్చింది.
ఈ విషయమై సోషల్ మీడియాలో సమంతా చేసిన కామెంట్స్ వెనుక ఆమె ఉద్దేశం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సమంత చేస్తున్న సినిమాల విషయానికొస్తే ఆమె తొలిసారి ఫ్యామిలీ వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ ప్లాట్ ఫారం లోకి అడుగు పెట్టిన సంగతి మనందరికీ తెలుసు. ఈ వెబ్ సిరీస్ ద్వారా సమంత మొదటి సారిగా పూర్తిస్థాయి విలన్ గా నటించబోతుండడంతో ఆమె అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.