
వనిత విజయ్ కుమార్ అంటే తెలియని వారు ఉండరు. ప్రతిరోజు నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంటుంది. ఈమె ఎవరో కాదు స్వయానా విజయ్ కుమార్ - మంజుల దంపతుల మొదటి కుమార్తె. ఈమె 1995వ సంవత్సరంలో ని సినీ రంగ ప్రవేశం చేసింది.వనిత విజయ్ కుమార్ తెలుగు,తమిళం, కన్నడలతో పాటు మలయాళంలో కూడా నటించింది. ఈమె గొప్ప నటి మాత్రమే కాదు బహుభాషా వ్యాకర్త. వనిత విజయ్ కుమార్ మొదట్లో 2000వ సంవత్సరంలో ఆకాష్ ని పెళ్లి చేసుకొని 2007వ సంవత్సరంలో అతనికి విడాకులు ఇచ్చింది.ఆ తర్వాత 2007వ సంవత్సరంలో ఆనంద్రాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
అయితే కొన్ని కారణాల చేత 2012లో అతనికి కూడా విడాకులు ఇచ్చింది. ఆమె అంతటితో ఆపకుండా 2020 వ సంవత్సరంలో రాబర్ట్ పీటర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2020 సంవత్సరం లోనే అతనికి కూడా డైవర్స్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.అయితే మరోసారి ఇంకొకరితో ప్రేమలో పడ్డాను అంటూ నెట్టింట్లో వైరల్ అవుతుంది.ఇప్పుడు చివరకు ఏకంగా తన తండ్రి తనను మోసం చేశాడంటూ మరోసారి సోషల్ మీడియాలో ముందుకొచ్చింది వనిత.వనిత మాట్లాడుతూ" నాన్న నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు.మా నాన్న విజయ్ కుమార్ నన్ను ఎప్పుడూ తన కూతురిగా చూడలేదు.పోలీసుల చేత బయటకి గెంటేయించడం తోపాటు నాకు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆ తరువాత ఇద్దరు పిల్లలతో ఒక సంవత్సరం పాటు ఎన్నో కష్టాలను అనుభవించాను.
మా నాన్న విజయ్ కుమార్ నాతో పాటు మా అమ్మ మంజులను కూడా మోసం చేశాడు. అమ్మ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆస్తి మొత్తాన్ని కొట్టేశాడు. అమ్మ చనిపోయాక నాకు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. ఈ విషయమై నేను కోర్టుకు వేయగా, అక్కడ న్యాయం జరగలేదు. ఆ తర్వాత ఆ సినిమా మొత్తం మిగతా కుటుంబ సభ్యులకు పంచేశాడు నాన్న.ఆ తరువాత ఎన్నో కష్టాలు అనుభవించి కర్ణాటకలో ఉన్న నా స్నేహితుల ద్వారా చాలా రకాల పని చేసి ఇప్పుడు కాస్త నిలదొక్కుకున్నాను".అంటూ చెప్పుకొచ్చింది వనిత విజయకుమార్.
అయితే ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తనకు లైన్ వేసే వాడు అంటూ చెప్తున్న వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి చెన్నైలో తెలుగు పరిశ్రమ ఉన్న సమయంలో మా ఫ్యామిలీ అంతా మెగాఫ్యామిలీ ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగిన వెళ్లే వాళ్ళమని వనిత చెప్పుకొచ్చింది.ఈ సందర్భంగా చిరంజీవి ఒక సినిమా ఓపెనింగ్ కు వెళ్ళినప్పుడు అల్లుఅర్జున్ కూడా తనకు లైన్ వేసాడు అంటూ ఆమె చెప్పిన వార్తలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి.