ఇక అప్పటి నుంచి అదే జీరో సైజ్ ను మెయింటేన్ చేస్తూ ఫుల్ గ్లామరస్ గా కనిపిస్తుంది. ప్రస్తుతం ఫుల్ బిజీ గా చేతి నిండా సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారు కీర్తి. ప్రస్తుతం నితిన్ రంగ్ దే, మహేష్ సరసన "సర్కారు వారి పాట" సినిమాలతో బిజీగా ఉంది కీర్తి. అయితే ఈ సమ్మర్ కి డబుల్ ధమాకా ఇవ్వనుంది కీర్తి సురేష్. కరోనా భయం వీడి థియేటర్లు తెరుచుకోగా మెల్ల మెల్లగా సినిమాలు ఒక్కొక్కటిగా రిలీజ్ అవడానికి ముందుకొస్తున్నాయి. కాగా నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన రంగ్ దే చిత్ర యూనిట్ ఒక శుభవార్త ను ప్రకటించింది. మార్చి 26న విడుదల కాబోతున్నట్లు యూనిట్ స్పష్టం చేసింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన రానుందో చూడాలి.
అటు అదే రోజున కీర్తి నటించిన మలయాళ చిత్రం 'మరక్కార్ అరబిక్కడలింటే సింహం'కూడా రిలీజ్ అవడానికి సిద్ధమైంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి ఓ కీలక పాత్ర పోషించింది. ఈ హిస్టారికల్ ఎపిక్ వార్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు .. మార్చ్ 26 నే థియేటర్లలో సందడి చేయనుంది. ఇలా కీర్తి సురేష్ సమ్మర్ కు డబుల్ ధమాకా ప్లాన్ చేసిందన్నమాట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి