
ఇదిలా ఉండగా, సంక్రాంతి సందర్భంగా చాలా మంది స్టార్ హీరోలు తమ ఫ్యాన్స్ కు సర్‌ప్రైజ్‌లు అందించారు. తమ కొత్త సినిమాలపై అప్‌డేట్‌లు ఇచ్చి వారిని సంతోష పెట్టారు. అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న `ఆర్ఆర్ఆర్` యూనిట్ మాత్రం కిమ్మనకుండా కూర్చుంది. వీరి నుంచి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. దీంతో ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు. `ఆర్ఆర్ఆర్` యూనిట్‌పై సెటైర్లు వేస్తున్నారు.
ఈ క్రమంలోనే `ఆర్ఆర్ఆర్` యూనిట్‌పై ఓ అభిమాని వేసిన సెటైర్ మిగతా ఫ్యాన్స్‌నే కాదు.. `ఆర్ఆర్ఆర్` టీమ్‌ను కూడా మెప్పించింది. `రాజమౌళి కుటీరం` పేరుతో వేసిన ఈ కార్టూన్‌లో రామ్‌చరణ్, ఎన్టీఆర్ నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నారు. వారికి కొంచెం ముందు ఇద్దరు మహిళలు ముగ్గులు వేసుకుంటూ ఉన్నారు. వారిలో ఓ మహిళ `అక్కా! సినిమా రిలీజ్ ఎప్పుడు` అని ప్రశ్నించగా.. `తప్పమ్మా! తెలియనివి అడగకూడదు’ అంటూ అక్క బదులిస్తుంది. ఈ సెటైర్‌పై `ఆర్ఆర్ఆర్` టీమ్ కూడా స్పందించింది. `సృజనాత్మకతతో కొట్టారు. చాలా నచ్చింది. హ్యాపీ సంక్రాంతి` అని రిప్లై ఇచ్చింది. అంతే కానీ సినిమాపై మాత్రం ఎటువంటి అప్ డేట్ ఇవ్వలేదని ఫ్యాన్స్ మరోసారి రెచ్చిపోతున్నారు. మళ్లీ ‘ఆర్ఆర్ఆర్’ పై ఏదో ఒక అప్ డేట్ వచ్చే వరకూ ఫ్యాన్స్ ఇలా అసహనం వ్యక్తం చేస్తూనే ఉంటారు మరి.