ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...వరుస ప్లాపులతో డీలా పడ్డ రవితేజాకి ఈ ఏడాది "క్రాక్"సినిమా ద్వారా మంచి మాస్ బ్లాక్ బస్టర్ హిట్ లభించింది.మాస్ మహారాజా రవితేజ నటించిన ‘క్రాక్’ సినిమా  17 వ రోజున కూడా ఒక రేంజిలో వసూళ్లు కలెక్ట్  చేసిందనే చెప్పాలి.17వ రోజున కూడా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 1.25 కోట్ల షేర్ ను రాబట్టడం విశేషం. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘సరస్వతి ఫిలిమ్స్ డివిజన్’ బ్యానర్ పై బి.మధు నిర్మించగా తమన్ సంగీతం అందించాడు.అతను అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైన ఈ సినిమా  బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా.. బ్లాక్ బస్టర్ గా కూడా నిలిచింది. 3 ఏళ్లుగా సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న రవితేజకు ఈ చిత్రం పెద్ద మాస్ హిట్  ఇచ్చిందనే చెప్పాలి. ‘డాన్‌శీను’, ‘బ‌లుపు’ వంటి బ్లాక్ ‌బ‌స్ట‌ర్స్ త‌ర్వాత `క్రాక్` చిత్రంతో రవితేజ -గోపీచంద్ లు హ్యాట్రిక్ హిట్ ని సొంతం చేసుకొని తెలుగు ఇండస్ట్రీ లో మంచి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అనిపించుకున్నారు.

ఇక ‘క్రాక్’ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా  18 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 17 రోజులకు గాను ఈ చిత్రం 34.85 కోట్ల షేర్ ను రాబట్టింది. 50 శాతం ఆకుపెన్సీతోనే ఈ రేంజ్ కలెక్షన్లను రాబట్టడం అంటే మామూలు  విషయం కాదు. ఇక ఈ చిత్రం కొన్న బయ్యర్స్ అంతా ఇప్పటికే ప్రాఫిట్ జోన్ లోకి అడుగుపెట్టడం  మరో విశేషం! ఈ సినిమా ని  కొనుగోలు చేసిన బయ్యర్లు ఇప్పటివరకూ 16కోట్ల పైనే లాభాలను దక్కించుకున్నారు. అంతేకాకుండా ఒక్క నైజాంలోనే ఈ చిత్రం 11కోట్లకు పైగా షేర్ ను రాబట్టి రికార్డు సృష్టించింది.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో మూవీ విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: