రిలీజ్‌డేస్‌ ఎనౌన్స్‌మెంట్‌ వారోత్సవంలా కొనసాగింది. నాలుగైదు సినిమాలు మినహా అందరూ రిలీజ్‌ డేట్‌ ప్రకటించేశారు. ఈ క్రమంలో మూడు, నాలుగు డేట్స్ క్లాష్‌ అయ్యాయి. ఒకే రోజు రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌ రావడంతో... పోటీ రసవత్తరంగా మారింది. ఒకే రోజు రెండు సినిమాలు వస్తే... పంచాయితీలు జరగాల్సిందే.

వారం గ్యాప్‌లో ఎంతటి పెద్ద సినిమాలు వచ్చినా... ఫర్వాలేదు. ఒకే రోజు  రెండు, మూడు చిన్న చిత్రాలు రిలీజైనా ఇబ్బంది లేదు. అయితే రెండు క్రేజీ మూవీస్‌ ఒకేసారి వస్తే మాత్రం.. థియేటర్స్‌ దొరకవు.  ఓపెనింగ్స్‌ ఎవరికీ రావు. రిలీజ్‌ డేట్స్‌ ఎనౌన్స్‌మెంట్‌ దాదాపు పూర్తికావడంతో.. ఎడ్జెస్ట్‌మెంట్‌పై దృష్టిపెట్టారు నిర్మాతలు.

ఏప్రిల్‌ 16న నాని 'టక్ జగదీష్‌'.. నాగచైతన్య 'లవ్‌స్టోరీ' రిలీజ్‌ అవుతున్నాయి. నిన్నుకోరి తర్వాత నాని, దర్శకుడు శివ నిర్వాణ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో.. టక్‌ జగదీష్‌పై భారీ అంచనాలున్నాయి. ఫిదా తర్వాత సాయిపల్లవి.. శేఖర్‌ ఖమ్ముల కలయికలో వస్తున్న లవ్‌స్టోరీపై హై ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. పోటీ ఎందుకనుకున్న టక్ జగదీష్‌ టీం.. ఏప్రిల్‌ 23 స్లాట్ ఖాళీగా ఉండటంతో.. ఆరోజే వద్దామని ఫిక్స్‌  అయిందట.

ఎప్పుడూ సోలోగా వచ్చే చిరంజీవి ఈ సారి పోటీ పడక తప్పడం లేదు. వెంకటేశ్‌ నారప్ప... చిరంజీవి ఆచార్య ఒక రోజు గ్యాప్‌లో వస్తున్నాయి. ఆచార్య రిలీజ్‌ డేట్‌ ఎనౌన్స్‌ మెంట్‌కు ముందే.. నారప్పను మే 14న విడుదల చేస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు. ఆచార్య టీజర్‌ రిలీజ్‌ చేయడంతోపాటు.. మే 13న రిలీజ్‌ అంటూ డేట్‌ కూడా ప్రకటించేసింది. పోటీపడే మనస్తత్వం లేని చిరంజీవి.. అందులోనూ.. వెంకటేశ్‌తో ఫైటింగ్‌ దిగడం షాక్‌ ఇచ్చింది. భారీ ఓపెనింగ్స్‌ కోరుకునే మెగా ఫ్యాన్స్‌  పోటీ లేకుండా.. వేరే డేట్‌ ప్రకటించాలంటూ.. ఒత్తిడి తెస్తున్నారు. సైలెంట్‌గా వుండే వెంకటేశే .. సైడ్‌ అవుతాడన్న టాక్‌ వినిపిస్తోంది.

బాలకృష్ణ.. రవితేజ ఎక్కువసార్లు పోటీపడ్డ హీరోలుగా నిలిచారు. మూడుసార్లు పోటీపడితే.. అన్నిసార్లూ రవితేజానే కిక్‌ ఎక్కించాడు. ఈ ఇద్దరు మరోసారి నువ్వా..నేనా అంటున్నారు. మే 28న బాలకృష్ణ బోయపాటి మూవీతో వస్తే.. రవితేజా ఖిలాడీగా వస్తున్నాడు. మే 28 ఎన్టీఆర్‌ జయంతి కావడంతో.. బాలకృష్ణ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్నారు. తగ్గితే గిగ్గితే.. ఖిలాడీనే వెనక్కి తగ్గొచ్చు. కాదు కూడదు.. అటో ఇటో తేల్చుకుందామనుకుంటే తప్ప.. ఏదో ఒక సినిమా ఆ రిలీజ్‌ డేట్‌ మారుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: