2010 సంవత్సరం వరకు విజయ్ సేతుపతి పేరు కూడ ఎవరికీ తెలియదు. ఒకప్రముఖ నిర్మాణ సంస్థలో అకౌంటెంట్ గా పనిచేస్తూ ఒక సాధారణ జీవితం గడిపాడు. అయితే అతడు పనిచేసేది ఒకప్రముఖ నిర్మాణ సంస్థ కావడంతో తరుచూ సినిమా షూటింగ్ లకు వెడుతూ అనేకమంది నటీనటుల నటనను చాల ఆశక్తిగా పరిశీలిస్తూ ఉండేవాడట. ఈఆసక్తిని గమనించిన ఒకప్రముఖ దర్శకుడు ఒక తమిళ సినిమాలో అవకాశం ఇచ్చినప్పటికీ విజయ్ సేతుపతి కెరియర్ ను ఒక మలుపు తిప్పిన సినిమా మటుకు ‘పిజ్జా’ మాత్రమే ఆసినిమా తరువాత విజయ్ మళ్ళీ వెనుతిరిగి చూడలేదు. ఈసంవత్సరం విజయ్ సేతుపతి జీవితంలో మర్చిపోలేని సంవత్సరం.
ఈసంక్రాంతికి విడుదలైన ‘మాష్టర్’ మూవీలో హీరో విజయ్ పాత్ర కంటె విజయ్ సేతుపతి పాత్రకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇక ‘ఉప్పెన’ తో ఇతడి పేరు టాలీవుడ్ లో హోరెత్తి పోతోంది. దీనితో ఇతడు ప్రకాష్ రాజ్ జగపతి బాబు లకు వచ్చే అవకాశాలను కబ్జా చేస్తాడా అంటూ అప్పుడే అంచనాలు మొదలైపోయాయి. అయితే ఇంత క్రేజ్ లో కూడ విజయ్ సేతుపతి విషయంలో ఒక లోటు కనిపిస్తోంది అంటూ విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు.
ప్రకాష్ రాజ్ లా ఏభాష సినిమాలో నటిస్తే ఆభాషలో తన సొంత గొంతుతో డబ్బింగ్ చెప్పుకునే సమర్థత విజయ్ సేతుపతికి లేదు. దీనితో ఇతడు తెలుగు హిందీ సినిమాలలో మరింత రాణించాలి అంటే ఈభాషలను తప్పనిసరిగా నేర్చుకోవలసిన అవసరం ఉంది. కళ్ళతో విజయ్ సేతుపతి నటిస్తాడు అన్న పేరు వచ్చినప్పటికీ కరుణరసాన్ని హాస్యాన్ని ఎంతవరకు విజయ్ సేతుపతి మెప్పించి శాస్వితంగా నిలబడగలడు అంటూ కొందరు విమర్శకులు విజయ్ సేతుపతి ఈవిషయాలలో మరింత మెరుగుపడాలని సూచనలు చేస్తున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి