ఇండియాలో డొమెస్టిక్ ఎయిర్‌లైన్ వ్యాపారరంగానికి సంబంధించి ఒక ప్రముఖ సంస్థ చేసిన ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించిన సర్వే రిపోర్ట్ లోని కొన్ని విషయాలు రామ్ చరణ్ షాక్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. గత కొద్ది కాలంగా డొమెస్టిక్ ఎయిర్వేస్ లో ప్రయాణంచేసే ప్రయాణీకుల సంఖ్య బాగా పెరగడంతో ఎయిర్వేస్ కంపెనీలకు వచ్చే ఆదాయంలో కూడ గణనీయమైన మార్పు వచ్చిందని ఇంటర్నేషనల్ ఎయిర్‌‌లైన్స్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ తన రిపోర్ట్ లో తెలిపిందని టాక్.

ఈ సంస్థ తయారు చేసిన రిపోర్ట్ ప్రకారం జనవరి – ఆగష్టు మధ్య విమానాలలో ఆక్యుపెన్సీ 29 శాతం పెరిగిందని తన అధ్యయనంలో పేర్కొంది. అయితే విమాన ప్యాసింజర్లకు సంబంధించి వచ్చిన మొత్తం 770  ఫిర్యాదుల్లో ఎక్కువ ట్రూజెట్ సర్వీసులపైనే అత్యధికంగా ఫిర్యాయాదులు ఉన్నాయని ఆసంస్థ  ఆ రిపోర్ట్ లో తెలిపినట్లుగా వస్తున్న వార్తలు రామ్ చరణ్ కు షాక్ ఇచ్చినట్లు టాక్. 

ఈసంస్థ ఒక నెలలో సమీక్షించిన ప్రతి పదివేల మంది ప్యాసెంజర్లలో లెక్క తీస్తే  ట్రూజెట్ వాటా 5% గా తేలిందని టాక్. అంతేకాదు ట్రూజెట్ సర్వీసులు బాగాలేవని  ప్రయాణికుల నుంచి ఫీడ్ బ్యాక్ వస్తోంది అన్న వార్తలు కూడ చరణ్ కు ఆశ్చర్యాన్ని కలిగించాయి అని టాక్. ఫిర్యాదుల విషయంలో ట్రూజెట్  తర్వాత స్థానం ప్రభుత్వ రంగ ఎయిర్ లైన్స్ ఎయిర్ ఇండియాది అని అంటున్నారు. 

అంతేకాదు సర్వీసుల రద్దు విషయంలోనూ ట్రూజెట్ మొత్తం జాబితాలో రెండవ స్థానంలో ఉందని ఈసర్వే రిపోర్ట్ చెపుతోందని వార్తలు వస్తున్నాయి. ఏమైనా ఒకవైపు టాప్ స్థానం కోసం ప్రయత్నిస్తూ వ్యాపార వేత్తగా ఎదుగుదామని తాపత్రయపడుతున్న రామ్ చరణ్ కు ఇదిషాకింగ్ న్యూస్ అనుకోవాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: