స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం పుష్ప. ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా చేస్తున్నారు. సుకుమార్ ద‌ర్శ‌కత్వంలో యాక్షన్ డ్రాప్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ఇది. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవ‌ర్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా ఆగస్టు 13న రిలీజ్ చేస్తామని ప్రకటించింది చిత్ర బృందం. అయితే ఆ దిశగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి కోవిడ్ 19 బ్రేకులు వేసిన సంగతి తెలిసిందే. హీరో అల్లు అర్జున్ కి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవడంతో సినిమా షూటింగ్ కాస్త ఆగిపోయింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని స్వయంగా అల్లు అర్జునే సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం తను హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్లు తెలియజేసిన బన్నీ... అభిమానులకు తన ఆరోగ్యం బాగానే ఉందని, లక్షణాలు చాలా స్వల్పంగా ఉన్నాయని ఎవారూ ఆందోళన చెందవద్దని తెలిపారు. అయితే తమ అభిమాన నటుడు కరోనా బారిన పడడంతో సతమత మవుతున్నారు ఫ్యాన్స్. "గెట్ వెల్ సూన్ అవర్ సూపర్ హీరో" అంటూ హంగామా చేస్తున్నారు చేస్తున్నారు. ఇంకొంత మంది అభిమానులు ఏకంగా బన్నీ ఫ్లెక్సీ తీసుకొని దేవాలయాలకు వెళ్లి పూజలు జరిపించి మరీ తమ అభిమాన నటుడు త్వరగా కోలుకొని తిరిగి చిరునవ్వుతో షూటింగ్ స్పాట్ లో అడుగుపెట్టాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నారు.

తాజాగా గిద్దలూరు లో ఇలాంటి సన్నివేశం చోటు చేసుకుంది. గిద్దలూరు కు చెందిన బన్నీ అభిమానులు గుడిలో బన్నీ ఉన్న ఫ్లెక్సీని దేవుడి ఎదుట పట్టుకొని తమ స్టైలిష్ హీరో ఆరోగ్యం బాగుండాలని... ఆయన  త్వరగా కోలుకొని తమ ముందుకు తిరిగి రావాలని ప్రత్యేక పూజలు జరిపించారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారికి తమ అభిమాన నటుడిపై ఉన్న ప్రేమను మరోసారి ఇలా చాటుకున్నారు ఫ్యాన్స్. దీనితో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అభిమానులంటే ఇలా ఉండాలి అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వీరి కోరిక ఫలించి త్వరలోనే అల్లు అర్జున్ కరోనా బారి నుండి పూర్తిగా కోలుకోవాలని మనమూ కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: