ఇప్పుడు మళ్ళీ షూటింగ్ ప్రారంభించుకోబోతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు హడావిడి చేస్తోంది. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో 8 నిముషాల పాటు ఒక పెద్ద పాట ఉంటుందట. 8 చరణాలతో ఒక పల్లవి తో ఉండే ఈపాట అలనాటి స్వాతంత్రోద్యమ స్పూర్తిని గుర్తుకు చేసేలా ఉంటుంది అని తెలుస్తోంది.
ఈ పాటను కొమరం భీమ్ అల్లూరి సీతారామరాజు పాత్రలను పోషిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లపై జూలై మొదటి వారంలో ఒక భారీ సెట్ చిత్రీకరిస్తారని టాక్. కీరవాణి సంగీత దర్శకత్వం వహించిన ఈ సాంగ్ ఒకనాటి ‘అల్లూరి సీతారామరాజు’ మూవీలోని ‘తెలుగువీర లేవరా’ పాట స్పూర్తితో ఉంటుందని వార్తలు గుప్పుమంటున్నాయి.
దీనితో ఈ పాట విషయంలో రాజమౌళి సాహసం చేస్తున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. వాస్తవానికి ఇప్పటి ట్రెండింగ్ సినిమాలలో పాటలను బాగా ఆదరిస్తున్నప్పటికీ ఆ పాటలు సినిమా కథలో పూర్తిగా ఇమిడిపోయి ప్రేక్షకులకు ఏమాత్రం అసహనం కలిగించకుండా ఉండాలి. ‘ఆర్ ఆర్ ఆర్’ విషయానికి వస్తే ఈ మూవీ చూస్తున్న ప్రేక్షకులకు అలనాటి స్వాతంత్రోద్యమ కాలంలోకి ప్రేక్షకులు వెళ్ళిపోయేలా చేయాలి అందుకోసమే ఈ పాటలో విపరీతమైన విజువల్ ఎఫెక్ట్స్ ఉండేలా రాజమౌళి డిజైన్ చేస్తున్నట్లు టాక్. ఈ ప్రయోగానికి ప్రేక్షకుల ఆదరణ లభిస్తే మళ్ళీ దేశభక్తి పాటల ట్రెండ్ తెలుగు సినిమాలలో మొదలయ్యే ఆస్కారం ఉంది. ఇప్పటికే ఈ మూవీ నిడివి దాదాపు 2 గంటల 45 నిముషాలు ఉంటుంది అని ప్రచారం జరుగుతున్న పరిస్థితులలో జక్కన్న ప్రయోగాన్ని ప్రేక్షకులు ఏవిధంగా ఆదరిస్తారో చూడాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి