కొంతమంది దర్శకులు వేరే దర్శకులతో తమను తాము పోల్చుకోవడం సహజమే. వారి సినిమాలు చూస్తూ వారిలా సినిమాలు చేయాలని ఆలోచిస్తూ వారిలా ఉండాలనే భావంతో తాము చేసిన సినిమాలను వారు చేసిన సినిమాలతో పోల్చుకోవడం ఇండస్ట్రీలో సహజమైన విషయం. ఇలాంటి పరిస్థితి హరిష్ శంకర్ ఇటీవలే చేసిన ఓ ట్వీట్ ద్వారా ఎదుర్కొన్నాడు. పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన బద్రి సినిమా గురించి పోస్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ చూపించిన ఎనర్జీని మరోసారి మీరు చూడబోతున్నారు అంటూ ట్వీట్ చేశారు.

అయితే దీనికి పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ మరోలా స్పందించడం మొదలు పెడుతున్నారు. టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ కు ప్రత్యేకమైన పేరు ఉంది. అంతే కాదు టాలీవుడ్ నెంబర్ వన్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అని కూడా అంటూ ఉంటారు. ప్రస్తుతానికి ఆయన ఫామ్ కొంత తగ్గినా కూడా ఒకప్పుడు ఆయనను అందుకునే దర్శకుడు లేడు. ఆయన తొలి చిత్రం పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోతో చేసి సూపర్ హిట్ అందుకొని ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగారు. ఆయన ప్రతి సినిమాలోనూ హీరో పాత్రను ఎంతో వైవిధ్యభరితంగా తీర్చిదిద్ది హీరో పాత్ర ద్వారానే సినిమా హిట్ వేస్తాడు. 

బద్రి సినిమాలో పవన్ కళ్యాణ్ చూసిన అభిమానులు ఇంతవరకూ ఏ దర్శకుడు కూడా అలా చూపించలేకపోయాడు అని చెప్తారు.  అలాంటి డైరెక్టర్ తో తనను తాను పోల్చుకోవడం హరీష్ శంకర్ ఓవర్ కాన్ఫిడెన్స్ కి నిదర్శనం పూరి అభిమానులు అంటున్నారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ను ఆ రేంజ్లో చూపిస్తే సంతోష పడేది తామేనని, పూరి జగన్నాథ్ రేంజ్ లో హరీష్ శంకర్ చూపించగలిగితే ఎంతో సంతోష పడతామని అని అంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలలో క్రేజీ ప్రాజెక్టుగా హరీష్ శంకర్ సినిమా ఉంది.  గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ సినిమా సూపర్ హిట్ కాగా ఇప్పుడు రాబోయే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆయన నటిస్తున్న మలయాళ సూపర్ హిట్ సినిమా ఏకే రీమేక్ త్వరలో విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: