అయితే ప్రకాష్ రాజ్ వేసిన ఈ ప్రశ్న ‘మా’ సంస్థ ఎన్నికలకు సంబంధించింది అనుకోవాలా లేకుంటే జాతీయస్థాయి ఎన్నికల గురించి అనుకోవాలా అన్న విషయమై స్పష్టమైన క్లారిటీ లేకపోవడంతో అనేకమంది రకరకాల అభిప్రాయాలు వ్యక్త పరుస్తున్నారు. అయితే ఇప్పట్లో జాతీయ స్థాయిలో కాని తెలుగు రాష్ట్రాలలో కాని ఎన్నికలు లేవు.
దీనితో ప్రకాష్ రాజ్ మళ్ళీ మా ఎన్నికలను టార్గెట్ చేస్తున్నాడు అన్నసందేహాలు వస్తున్నాయి. వాస్తవానికి మా అధ్యక్షుడుగా ఎంపిక అయినంత మాత్రాన ప్రకాష్ రాజ్ కు అదనంగా వచ్చే పేరు కాని పరపతి కాని ప్రత్యేకంగా ఏమి ఉండడు. అయితే ఒక చిన్న సంస్థ ఎన్నికల విషయంలో జాతీయ స్థాయి ఇమేజ్ ఉన్న ప్రకాష్ రాజ్ అత్యుత్సాహం చూపించడమే కాకుండా ఇంకా ఎన్నికల ప్రకటన రాకుండానే ప్రకాష్ రాజ్ చేస్తున్న హడావిడి చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఇప్పటికే మా సంస్థ అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తున్నట్లు మంచు విష్ణు జీవిత హేమ లు ప్రకటించినప్పటికీ ఎన్నికల ప్యానల్ ను ఏర్పరుచుకునే విషయంలో ప్రకాష్ రాజ్ చాల ముందు చూపుతో వ్యవహరించి అందరికంటే ముందున్నాడు. సాధారణ ప్రజలు కూడ మా ఎన్నికలను రాష్ట్రాల ఎన్నికలుగా భావిస్తూ ఎన్నికలలో ఓట్లు వేయడానికి ఆశక్తి కనపరచని వ్యక్తులు కూడ ‘మా’ సంస్థ ఎన్నికల పట్ల ఆశక్తి కనపరచడం ఆశ్చర్యం. దీనితో ఈ ఎన్నికలలో జాతీయ రాజకీయాలకు మించిన ట్విస్ట్ లు ఉంటాయని జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి