సెప్టెంబర్ లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో తన చేస్తున్న సినిమాలను విడుదలకు సిద్ధంగా ఉంటాడు బాలకృష్ణ. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చివరి దశలో ఉండగా త్వరలోనే షూటింగ్ ను పూర్తి చేసి వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కంప్లీట్ చేసి సెప్టెంబర్ వరకు సినిమా విడుదల చేయాలనేది బాలకృష్ణ ప్లాన్. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే హిట్ దర్శకుడు గోపీచంద్ మలినేని తో ఓ సినిమాను ప్లాన్ చేశాడు బాలకృష్ణ. దాని తరువాత కమర్షియల్ సినిమాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం లో కూడా ఓ సినిమా చేయనున్నాడు.

ఇద్దరు దర్శకులు తీరు వేరు వేరు కాగా ఇద్దరు వెరైటీ దర్శకులతో బాలకృష్ణ చేతులు కలపడం ప్రేక్షకులను ఎంతో ఆసక్తి పరుస్తుంది. ఒకరు ఫక్తు మాస్ మసాలా సినిమా చేయడంలో దిట్ట అయితే మరొకరు మాస్ సినిమాలకు కామెడీని మేళవించి చేసే దర్శకుడు మరొకరు. దర్శకుల ఎంపిక తోనే ఎంతో ఆకట్టుకున్న బాలకృష్ణ సినిమాలతో ఇంకా ఎంత ఆకట్టుకుంటాడో అని ప్రేక్షకులు ఈ సినిమాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక బాలకృష్ణ వీరితో మాత్రమే కాకుండా శ్రీవాస్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం అయ్యాయి.

కానీ ఈ దర్శకుడు ఇటీవలే గోపీచంద్ తో తన సినిమాను అనౌన్స్ చేయడంతో బాలకృష్ణ కాంబినేషన్ లో సినిమా ఇప్పట్లో లేదని తెలుస్తోంది. బాలకృష్ణ తో గతంలో డిక్టేటర్ సినిమా చేయగా అది కొంతవరకు పర్వాలేదనిపించింది.  దాంతో మంచి సినిమా చేసి బాలకృష్ణ కు హిట్ ఇవ్వాలని శ్రీవాస్ ఆలోచించగా అది క్యాన్సిల్ అయింది. దానికి కారణం బాలకృష్ణ సినిమాల సంఖ్య ఎక్కువగా ఉండటమే అని తెలుస్తోంది. అఖండ సినిమా విడుదలైన తరువాత పైన చెప్పుకున్నట్లు ఇద్దరు దర్శకులతో సినిమాలు చేయాలి. అవి పూర్తి అయ్యేసరికి రెండు సంవత్సరాలైనా టైం పడుతుంది. అన్ని రోజులు శ్రీవాస్ వెయిట్ చేయలేకపోవడంతో బాలకృష్ణ శ్రీవాస్ తో సినిమా చేయలేకపోతున్నాడు. ఈ లోపుగానే శ్రీవాస్ గోపీచంద్ తో తన మూడో సినిమాను అనౌన్స్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: