
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో రీమేక్ సినిమాలు చేయడం చాలా సహజం. అలనాటి హీరోల దగ్గర నుంచి ఇప్పటి యువతరం హీరోల వరకు చాలా మంది రీమేక్ సినిమాలను చేస్తూ హిట్లు కొడుతూ ప్రేక్షకులను ఎంతగానో ఆలోచిస్తున్నారు తమకు తెలియని భాష లోని సినిమాలను, మంచి సినిమాలు ఎలా చూడాలి అని భావిస్తున్న ప్రేక్షకులకు ఈ విధంగా రీమేక్ సినిమాలు చేసి వారిని ఎంతగానో అలరిస్తున్నారు. తాజాగా తెలుగులో స్టార్ హీరోల సినిమాలు కొన్ని రీమేక్ చిత్రాలు తెరకెక్కుతున్నాయి.

ఆ విధంగా మలయాళ సినీ పరిశ్రమలోని ఎక్కువ సినిమాలు ఇప్పుడు తెలుగులో రీమేక్ అవుతుండటం విశేషం. అలా టాలీవుడ్ లో రీమేక్ అవుతున్న మలయాళ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ అనే మలయాళ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఈ సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకాగా ఇక్కడ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
వెంకటేష్ హీరోగా చేస్తున్న తాజా చిత్రం దృశ్యం 2 కూడా మలయాళంలో తెరకెక్కిన సినిమానే. జీతు జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ సినిమా ను ఇక్కడ వెంకటేష్ మీనా జంటగా చేస్తున్నారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా తో కలిసి నటిస్తున్న అయ్యప్పనుం కొశియం సినిమా కూడా మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమా. ఈ చిత్రానికి టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రచయితగా పని చేస్తుండడం విశేషం. నిత్యామీనన్ ఐశ్వర్య రాజేష్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక మలయాళం బ్లాక్ బస్టర్ సినిమా లో డ్రైవింగ్ లైసెన్స్ అనే సినిమా కూడా త్వరలోనే రవితేజ హీరోగా తెరకెక్కబోతుంది. అంతే కాకుండా కొన్ని చిన్న సినిమాలు కూడా మలయాళం నుంచి తెలుగులోకి వస్తున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా కప్పేలా, హెలెన్ వంటి చిన్న చిత్రాలు తెలుగులో రీమేక్ అవుతున్నాయి. అంతేకాకుండా టాలీవుడ్ ఓటీటీ ఆహా లో కూడా పలు మలయాళం బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు టాలీవుడ్ కి సరఫరా అవుతుండటం విశేషం.