నాగార్జున కెరియర్ తొలినాళ్ళల్లో అతడి అభిమానులు అతడిని యువ సామ్రాట్ అని బాలకృష్ణ అభిమానులు మొదట్లో యువరత్న అని పిలుచుకుంటూ ఉండేవారు. వీరిద్దరి వయస్సు పెరిగి పోయిన తరువాత నాగార్జున కింగ్ గా మారిపోయాడు బాలకృష్ణ నందమూరి సింహం గా మారిపోయాడు. అదేవిధంగా మహేష్ మొదట్లో ప్రిన్స్ ఆఫ్ టాలీవుడ్ గా పేరుతెచ్చుకుని ఇప్పుడు సూపర్ స్టార్ గా మారిపోయాడు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు 50 సంవత్సరాలు రావడంతో అతడి పవర్ స్టార్ ట్యాగ్ తొలిగిపోయి ‘గాడ్ ఆఫ్ మాసెస్’ గా మారిపోయాడు. లేటెస్ట్ గా పవన్ పుట్టినరోజునాడు విడుదలైన ‘భీమ్లా నాయక్’ పాట వీడియోలో పవన్ కళ్యాణ్ పేరు పైన పవర్ స్టార్ అని కాకుండా గాడ్ ఆఫ్ మాసెస్ అంటూ కొత్త ట్యాగ్ లైన్ క్రియేట్ చేయడం చాలామందిని ఆశ్చర్య పరిచింది.
ఇప్పటి వరకు రామ్ చరణ్ ని మెగా పవర్ స్టార్ అని అంటున్నారు. పవన్ గాడ్ ఆఫ్ మాసెస్ గా మారిపోవడంతో ఇప్పుడు చరణ్ శాస్వితంగా పవర్ స్టార్ గా మారిపోతే తెలుగు రాష్ట్రాలలోని మాస్ ప్రేక్షకులకు దేవుడు గా పవన్ కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. పవన్ ప్రస్తుతం సినిమాలు చేస్తున్నప్పటికీ అతడి దృష్టి అంతా రాజకీయాల పైనే ఉంది. 2024లో రాబోతున్న ఎన్నికలు పవన్ పొలిటికల్ కెరియర్ కు జీవన్మరణ సమస్య. అందువల్లనే చాల ముందు చూపుతో ఆలోచించి ‘భీమ్లా నాయక్’ వ్యవహారాలు చూస్తున్న త్రివిక్రమ్ సంగీత దర్శకుడు తమన్ కు సలహా ఇచ్చి ఈమూవీకి సంబంధించిన పాట వీడియోలో పవన్ పేరు ముందు ‘గాడ్ ఆఫ్ మాసెస్’ అన్న ట్యాగ్ లైన్ ఇచ్చి ఉంటారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి