ఇటీవల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో హిట్ సినిమాలను రీమేక్ చేస్తున్నారు. ఇలా రిమేక్ చేసిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులకు నచ్చే సూపర్ డూపర్ హిట్ కూడా సాధిస్తున్నాయ్. ఇలా ప్రేక్షకులకు రీమేక్ సినిమాలు బాగా నచ్చడంతో దర్శకనిర్మాతలు అందరూ కూడా దృష్టి రిమేక్ మీద పడిపోయింది. అయితే ప్రస్తుతం ఓ కన్నడ సినిమా తెలుగు రీమేక్ గా మేఘ అనే సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాపై ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్ మేఘా ఆకాష్ ప్రధాన పాత్రలో ఈ సినిమాలో తెరకెక్కింది.



 ఎమోషనల్ లవ్ స్టోరీ గా డియర్ మెగా స్టోరీ సాగిపోతూ ఉంటుంది. హీరోయిన్ పాత్రపరంగా కథ సాగుతూ ఉంటుంది. అంతేకాదు హీరోయిన్ లైఫ్ లో జరిగే సంఘటనలు చుట్టూ సినిమా మొత్తం తిరుగుతూ ఉంటుంది. కన్నడంలో ఎంతగానో హిట్ సాధించిన దియా  సినిమాకు డియర్ మేఘ తెలుగు రిమేక్ అయ్యింది అనే చెప్పాలి. మరీ ముఖ్యంగా ఇక ఈ సినిమాలో కాస్త సెంటిమెంట్ డోస్ ఎక్కువైంది అనే చెప్పాలి.  ముఖ్యంగా మదర్ సెంటిమెంట్ క్లైమాక్స్ అయితే ఈ సినిమాలో కట్టిపడేస్తాయి అని ప్రేక్షకులు చెబుతున్నారు.



 అయితే డియర్ మేఘ సినిమా అటు ప్రేక్షకులను ఎంతగా కనెక్ట్ అయిపోయింది ఎంతలా కన్నీళ్లు తెప్పించింది అన్న విషయాన్ని  ఇటీవల ఒక ప్రేక్షకుడు చెప్పిన రివ్యూ చూస్తే అర్థమవుతుంది.   ప్రేక్షకుడు చెప్పిన రివ్యూకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది. ఈ వీడియో చూస్తుంటే  వామ్మో రివ్యూ ఇలా కూడా చెబుతారా అంటూ అందరూ అవాక్కవుతున్నారు. ఆ రేంజిలో ఆ ప్రేక్షకుడు రివ్యూ చెప్పి షాక్ ఇచ్చాడు. ఏకంగా వ్యక్తి ఏడుస్తూ రివ్యూ చెప్పాడు. సినిమాలో హీరోయిన్ ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటుందని ఇక ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నాయని క్లైమాక్స్ అయితే ఎవరూ ఊహించనిది అంటూ చెబుతాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: