అలా కథ మొత్తం వీరిద్దరి మధ్య తిరుగుతూ ఎన్నో మలుపులు తిరుగుతుంది. ఇందులో అల్లరి నరేష్ నటన ప్రత్యేకంగా ఆకట్టుకుంది. అప్పటి వరకు హాస్యం ప్రధానంగా నిలిచే పాత్రలతో హీరోగా అక్కట్టుకున్న అల్లరి నరేష్ తొలి సారి ఇలాంటి ఒక పాత్రలో నటించి తన లోని మరో యాంగిల్ ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. రొటీన్ కి భిన్నంగా కామెడీ యాంగిల్ ను పక్కన పెట్టి, ఫుల్ ఎమోషన్ పాత్రతో ప్రేక్షకుల్ని మెప్పించారు. అల్లరి నరేష్ రవి పాత్రకు నూటికి నూరుపాళ్లు న్యాయం చేశారు.. ఒక్కమాటలో చెప్పాలంటే రవి పాత్రకు తన నటనతో ప్రాణం పోశారు అల్లరి నరేష్.
తనదైన శైలిలో ఎమోషనల్ సీన్స్ లో నటించి ఆడియన్స్ చేత అదుర్స్ అనిపించుకున్నారు. కామెడీ, ఏమోషన్, బలమైన కథ, మ్యూజిక్, పాత్రలు ఇలా అన్ని ఈ సినిమా విజయానికి ప్లస్ అయ్యాయి. ఈ సినిమా చూసిన వారంతా అల్లరి నరేష్ నటనకు ముగ్ధులయ్యారు. అంతేకాదు స్లో అయిన అతని కెరీర్ కి మళ్ళీ బూస్ట్ అప్ ఇచ్చింది ఈ చిత్రం. ఒక్కోసారి కొన్ని సినిమాలకు హీరోలు ఎంత ప్రధానమవు సహాయక పాత్రలది కూడా అంతే ప్రధానం. ఈ సినిమా విజయం సాధించడానికి అల్లరి నరేష్ పాత్ర బాగా హెల్ప్ అయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి