మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల తర్వాత టాలీవుడ్ లో ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి ఏంటనే దానిపై అందరూ కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల విషయంలో టాలీవుడ్ పెద్దలు అనుసరించిన వైఖరి అదే విధంగా కొంతమంది చేసిన విమర్శలు ఎన్నికల విషయంలో కొంతమంది జోక్యం చేసుకునే విధానం అలాగే రాజకీయ జోక్యం అన్నీ కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెద్దల మధ్య విభేదాలను అనే అభిప్రాయం చాలా వరకు వినపడుతోంది. టాలీవుడ్ లో ఇప్పటి నుంచి పరిస్థితులు మారిపోయే అవకాశాలున్నాయని ఇప్పటివరకు ఉన్న పరిస్థితులు భవిష్యత్తులో కనపడకపోవచ్చు అని అంటున్నారు.

టాలీవుడ్ పెద్దలు కొంత మంది ఇప్పటికే విభేదాలతో కొంతమందిని పూర్తిగా పక్కన పెట్టారని మెగా ఫ్యామిలీ వర్సెస్ టాలీవుడ్ గా పరిస్థితి మారిపోయే అవకాశం ఉండవచ్చని అంటున్నారు. చాలా మంది యువ హీరోలు మెగా ఫ్యామిలీ తో స్నేహం కోసం ప్రయత్నాలు చేస్తున్నా సరే మెగా ఫ్యామిలీ మాత్రం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో జరిగిన పరిణామాలను దృష్టిలోపెట్టుకుని వాళ్లను పక్కన పెడుతుంది అని కూడా అంటున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు ఇప్పుడు కొంతమంది దర్శకులను కూడా పక్కన పెట్టేశారు అని తెలుస్తోంది.

అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల విషయంలో అల్లు అరవింద్ చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించటమే కాకుండా ఎన్నికలు ముగిసిన తర్వాత నందమూరి బాలకృష్ణ పై చేసిన వ్యాఖ్యలు కూడా బాగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక టాలీవుడ్ పరిస్థితులను కొంతమంది అంచనా వేస్తున్నామని చిరంజీవి చాలా మంది పై ఆగ్రహంగా ఉన్నారని ప్రధానంగా మంచు విష్ణు విజయం కోసం చివరి వరకు పనిచేసిన నరేష్ విషయంలో ఆయన చాలా సీరియస్ గా ఉన్నారని అంటున్నారు. భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి ఏంటి అనేది మీడియా కూడా చూస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: