ఎట్టకేలకు అఖిల్ ఆశించిన హిట్ అతడి దరి చేరడంతో అఖిల్ మంచి జోష్ లో ఉన్నాడు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ మూవీకి టాక్ యావరేజ్ గా వచ్చినప్పటికీ ఈమూవీ కలక్షన్స్ రీత్యా దసరా రేస్ విజేతగా మారడమే కాకుండా మొదటి వారం పూర్తి కాకుండానే లాభాల బాట పట్టింది అంటూ వార్తలు వస్తున్నాయి.


హిట్ కోసం 6 సంవత్సరాలుగా అఖిల్ కల నెరవేరింది. ఈ సందర్భంలో ఈమూవీ సక్సస్ పై కొందరు విలక్షణ కామెంట్స్ చేస్తున్నారు. ఈమూవీ నిర్మాత అల్లు అరవింద్ గతంలో చాల సంవత్సరాల క్రితం అక్కినేని నాగేశ్వర రావుతో పొందిన నష్టాన్ని ఆయన మనవలు చైతూ అఖిల్ లు వడ్డీతో సహా అరవింద్ కు సరిపెట్టారు అంటూ ఒక కామెంట్ వినిపిస్తోంది.


చాల సంవత్సరాల క్రితం అక్కినేని నాగేశ్వర రావు జీవించి ఉన్న రోజులలో అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బి.గోపాల్ దర్శకత్వంలో అక్కినేని చిరంజీవి ల కాంబినేషన్ లో ‘మెకానిక్ అల్లుడు’ అన్న మూవీని తీసారు. ఆమూవీ అప్పట్లో భారీ అంచనాలతో రిలీజ్ అయింది. అక్కినేని చిరంజీవిల కాంబినేషన్ మొదటిసారి కావడంతో ఆ మూవీ సూపర్ హిట్ అవుతుందని అప్పట్లో అందరు భావించారు. అయితే ఆమూవీ సూపర్ ఫ్లాప్ గా మారింది.


అప్పట్లో ఈసినిమాతో అరవింద్ కు నష్ట్టాలు వచ్చాయి అన్న ప్రచారం కూడ జరిగింది. ఆతరువాత మళ్ళీ ఎవ్వరు అక్కినేని చిరంజీవిల కాంబినేషన్ రిపీట్ చేయలేదు. అది జరిగిన చాల సంవత్సరాలకు అరవింద్ నాగచైతన్య తమన్నా లతో తీసిన ‘100% లవ్’ సూపర్ హిట్ అయి అరవింద్ కు ఆరోజులలో కనక వర్షం కురిపించింది. మళ్ళీ ఒక దశాబ్ద కాలం తరువాత అరవింద్ అఖిల్ తో తీసిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ ఆమూవీ టాక్ తో సంబంధం లేకుండా మొదటి వారం పూర్తి కాకుండానే లాభాల బాట పట్టడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. దీనితో అక్కినేని మనవలు అరవింద్ కు బాగా లాభాలు తెచ్చిపెట్టారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..

 


మరింత సమాచారం తెలుసుకోండి: