‘బాహుబలి’ తరువాత నేషనల్ సెలెబ్రెటీగా మారిన ప్రభాస్ కు దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. ఒక తెలుగు హీరోకి జాతీయ స్థాయిలో ఈ రేంజ్ గుర్తింపు రావడం అంత సాధారణమైన విషయం కాదు. అయితే ప్రభాస్ కు వచ్చిన ఈ గుర్తింపు చివరివరకు నిలబడుతుందా అన్న టెన్షన్ డార్లింగ్ అభిమానులను ప్రస్తుతం వెంటాడుతోంది. ‘బాహుబలి’ తరువాత భారీ అంచనాలతో విడుదలైన ‘సాహో’ అంచనాలను అందుకోలేకపోయింది.


అయినప్పటికీ ప్రభాస్ మ్యానియా ఏమాత్రం తగ్గలేదు మరింత పెరిగింది. దీనితో ప్రభాస్ కు వరసపెట్టి పాన్ ఇండియా మూవీలు రావడమే కాకుండా అతడి పారితోషికం 100 కోట్ల స్థాయికి చేరుకుంది. దీనితో ప్రభాస్ అభిమానులు విపరీతమైన జోష్ లో ఉన్నారు. అంతేకాదు ‘రాథే శ్యామ్’ మూవీ విడుదల తరువాత ప్రభాస్ క్రేజ్ మరింత పెరిగిపోతుందని అభిమానులు అంచనాలు వేస్తున్నారు.


అయితే లేటెస్ట్ గా విడుదలైన ‘రాథే శ్యామ్’ టీజర్ లోని విక్రమాదిత్య పాత్రకు సంబంధించిన ఎలివేషన్ చాల క్లాసిక్ గా ఉంది అన్న కామెంట్స్ వస్తున్నాయి. దీనితో మాస్ ఇమేజ్ విపరీతంగా ఉన్న ప్రభాస్ ఇలాంటి పాత్రలలో నటిస్తే మాస్ ప్రేక్షకులు ఆదరిస్తారా అన్న సందేహాలు ప్రభాస్ అభిమానులను ప్రస్తుతం వెంటాడుతున్నాయి.


దీనికితోడు ‘రాథే శ్యామ్’ ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీతో పోటీగా విడుదల అవుతోంది. ‘ఆర్ ఆర్ ఆర్’ మ్యానియా ముందు ‘రాథే శ్యామ్’ టాక్ లో ఏమైనా తేడా వస్తే ఎంతవరకు నిలబడగలుగుతుంది అన్న భయం కూడ ప్రస్తుతం ప్రభాస్ అభిమానులలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘రాథే శ్యామ్’ తరువాత ప్రభాస్ శ్రీరాముడు పాత్రను పోషిస్తున్న ‘ఆదిపురుష్’ విడుదల అవుతుంది. ప్రస్తుత తరం ప్రేక్షకులు పౌరాణిక సినిమాలను చూస్తారా అన్న సందేహాలు ప్రభాస్ అభిమానులకు ఉన్నాయి. దీనితో ప్రభాస్ తన సినిమాల కథల ఎంపిక విషయంలో తప్పు చేస్తున్నాడా అన్న భయాలు ప్రస్తుతం అభిమానులలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే ‘రాథే శ్యామ్’ లేటెస్ట్ టీజర్ కు వస్తున్న రికార్డు స్థాయి హిట్స్ ను పరిశీలిస్తున్న అభిమానులు కొంతలో కొంత ధైర్యాన్ని కూడగట్టు కుంటున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: