ఈ మూవీలో రాజమన్నార్ పాత్రను టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ జగపతి బాబు నటిస్తుండగా..మరో కీలక పాత్ర కోసం తమిళ స్టార్ విజయ్ సేతుపతి ని తీసుకుంటున్నట్లు సినీ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. మరి ఈ భారీ బడ్జెట్ చిత్రంలో ఏ ఏ అగ్ర స్టార్ లు కనిపించనున్నారో అన్న ఆసక్తి అందరిలోను కనిపిస్తోంది. ఈ సినిమాలో డార్లింగ్ ఫుల్ వైలెంట్ గా కనిపించబోతున్నారు అని తెలిసినప్పటి నుండి ఫ్యాన్స్ చాలా ఈగర్ గా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు కూడా మరో పవర్ఫుల్ అట్రాక్షన్ గా నిలవనున్నాయని చెబుతున్నారు చిత్ర యూనిట్ సభ్యులు.
ఈ సినిమాను వచ్చే ఏడాది 2022 లో ఏప్రిల్ 14న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసినట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. మరి సమ్మర్ స్పెషల్ గా విడుదల కానున్న ఈ చిత్రం అంతే హాట్ గా ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరిస్తుందని ఆశిద్దాం. ప్రభాస్ కెరియర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలవాలని కోరుకుందాం. కేజిఎఫ్ చిత్రంతో తన సత్తా ఏంటో తెలియ చేసిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో మరో సంచలనాన్ని సృష్టించి ప్రభాస్ ఫాన్స్ కి పెద్ద బహుమతి ఇస్తారని అభిమానులు కూడా గట్టి నమ్మకం పెట్టుకున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి