అయితే పొలిటికల్ థీమ్ పై సినిమా తీయడం అంటే ఆషా మాషీ విషయం కాదు. వాస్తవాలు జోడించి కథను ఇంట్రెస్టింగ్ గా ఎలివెట్ చేయాలి, అందులో సింగల్ టేక్ లా ఒకే మూడ్ పై కథ వెళ్లకుండా అన్ని యాంగిల్స్ ఉండేలా చూసుకోవడంతో పాటు మెయిన్ కాన్సెప్ట్ దెబ్బ తినకుండా చూసుకోవాలి.
పాటల విషయం లోను జాగ్రత్త వహించాలి. ఇలా ఎన్నో రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అన్నిటికన్నా ముందు పాలిటిక్స్ పై చాలా రీసెర్చ్, హోమ్వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇలా అన్ని రెడీ చేసుకున్న తర్వాత అందుకు తగ్గా హీరోని ఎంచుకుని, ఎలా కథను టేకాఫ్ చేస్తే అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందో చూసుకుని ముందుకు సాగాలి. ఇక పొలిటికల్ యాక్షన్ డ్రామాగా చాలా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయాలను సాధించాయి. ఈ తరహాలో వచ్చిన ఒకటి రెండు చిత్రాలు నిరాశ పరచగా దాదాపు అన్ని చిత్రాలు ప్రేక్షకులను బాగానే అలరించాయి. ఒకసారి ఆ చిత్రాలను మరోసారి రిమైండ్ చేసుకుందాం.
అందులో ముఖ్యంగా నేటి తరానికి కనెక్ట్ అయి ఒక మార్పును ఆశించి తీసిన సినిమాలలో లీడర్, ఆపరేషన్ దుర్యోధన, నేనే రాజు నేనే మంత్రి, భరత్ అనే నేను, అరవింద సమేత, అధినేత, ప్రతినిధి, ఎవడైతే నాకేంటి లాంటి ఎన్నో సినిమాలు ప్రజలను ఆకట్టుకుని మంచి పేరును తెచ్చుకున్నాయి. అయితే ఈ సినిమాల వలన ఒక మనిషిలో మార్పు వచ్చినా ఆ సినిమా యూనిట్ సక్సెస్ అయినట్టే లెక్క.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి