
ఇక శ్రేయ, బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, మాలీవుడ్ సూపర్ స్టార్ హీరో ఫహాధ్ ఫాజిల్ ఇలా ప్రతి ఒక్కరికి కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చి మరీ ప్రతి ప్రాంతీయ భాషకు చెందిన నటులు ఈ సినిమాలో నటింపజేయడం గమనార్హం. మొట్టమొదటిసారి పూర్తిస్థాయిలో ఈ సినిమాను భారీ అంచనాల మద్య ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న తరుణంలో పెద్ద ఎత్తున అన్ని భాషలలో ఈ సినిమాకు ప్రమోషన్ చేస్తూ ఉండడం గమనార్హం. ఈ ప్రమోషన్స్ లో భాగంగానే ముంబైలో పూర్తిస్థాయిలో అతిపెద్ద స్టేజ్ ఏర్పాటు చేసి ప్రమోషన్స్ నిర్వహిస్తుండడం అందరికీ ఆశ్చర్యం గా అనిపిస్తోంది.
ఇప్పటివరకూ కనీవినీ ఎరుగని రీతిలో ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం ముంబైలో ఇంత పెద్ద స్టేజ్ ను ప్రమోషన్స్ కోసం ఏర్పాటు చేయడం ఇదే మొదటి సారి ఏది ఏమైనా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఈ స్టేజ్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడం అది కాస్త వైరల్ గా మారింది.